కొవిడ్-19 వ్యాక్సిన్‌పై తప్పుదోవ పట్టించే ట్వీట్లను గుర్తిస్తున్నామని ట్విట్టర్ సంస్థ తెలిపింది. హెచ్చరించిన తర్వాత కూడా వినియోగదారుడు ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఖాతాను తొలగించనున్నట్లు పేర్కొంది. సదరు ట్వీట్లలో వ్యాక్సిన్ గురించి తప్పుడు సమాచారం ఉందా? లేదా? సమీక్షించడానికి మనుషులనే ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
"ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించేవారికి ముందు హెచ్చరికలు పంపిస్తాము. సదరు ట్వీట్లు ఏ విధంగా నియమాలను ఉల్లంఘిస్తున్నాయో వివరిస్తాము. సమాజానికి ఆ ట్వీట్లు ఏ విధంగా హాని కలిగిస్తాయో స్పష్టంగా చెబుతాము. ఈ విధమైన అవగాహన వల్ల ఖాతాదారురు జాగ్రత్తలు పాటించగలరు. ఒక హెచ్చరికకు ఎలాంటి చర్యలు ఉండవు. కానీ రెండుసార్లు హెచ్చరికలు వస్తే 12 గంటలపాటు సదరు ఖాతాను నిలిపివేస్తాము. ఐదు లేదా అంతకన్నా ఎక్కువ అయితే ఖాతాను పూర్తిగా తొలగిస్తాము." అని ట్విట్టర్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది.
కరోనా గురించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన కొన్ని ఖాతాలను గత డిసెంబర్లోనే ట్విట్టర్ తొలగించింది.