ETV Bharat / bharat

ఆ ఆటో ఎక్కితే.. ఐప్యాడ్, టీవీ, ఫ్రిడ్జ్! - కరోనా వార్తలు

పట్టకున్నా 10 మందిని ఎక్కించి, ఇరుకుగా తీసుకెళ్లే ఆటోలే మనకు తెలుసు. అలాంటి ఆటో ప్రయాణాన్ని అందమైన వినోద యాత్రగా మలుస్తున్నాడు ఆ డ్రైవర్. వార్తా పత్రికలు, టీవీ, ఫ్రిడ్జ్ సహా ఐప్యాడ్ అందుబాటులో ఉంచాడు. అయితే ఆటోనే కాదు ఈ కుర్రాడి కథా.. ఆసక్తికరంగానే ఉంది.

hi-tech auto-rickshaw
హైటెక్ ఆటో
author img

By

Published : Jul 23, 2021, 12:21 PM IST

ఉన్నత చదువులతో వ్యాపారవేత్తగా రాణించాలని కలల కన్న కుర్రాడు అతను. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పుస్తకాలనే పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్​గా మారాడు తమిళనాడు చెన్నైకి చెందిన అన్నా దురై. అయితేనేం? తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కాంక్షించాడు. తన ఆటోను.. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దాలనుకున్నాడు.

ఆటోలో ఐప్యాడ్..

ఆ లక్ష్యంతోనే తన పొదుపులతో న్యూస్​ పేపర్లు, మేగజైన్లు, టీవీ, ఐప్యాడ్, ఛార్జింగ్​ పాయింట్, కార్డు స్వైపింగ్ యంత్రం ఆటోలో ఏర్పాటు చేశాడు దురై.

hi-tech auto-rickshaw
ఐప్యాడ్
hi-tech auto-rickshaw
అన్నా దురయి

ఫ్రిడ్జ్​ కూడా..

hi-tech auto-rickshaw
మాస్కులు, శానిటైజర్

కరోనా వేళ భద్రత కోసం మాస్కులు, శానిటైజర్​ పెట్టాడు. కస్టమర్​లు కూల్​ కూల్​గా ఉండేందుకు.. చిన్న ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసి, అందులో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాడు. దీంతో ఎంతో మంది కస్టమర్లు అతడి ఆటో ఎక్కడానికి ఇష్టపడుతుంటారు. అతడిని ఆటో అన్నా అని కూడా పిలుచుకుంటారు.

hi-tech auto-rickshaw
ఆటోలో టీవీ, ఫ్రిడ్జ్, ఛార్జింగ్ పాయింట్

గుర్తింపు ప్రత్యేకతతోనే..

ఉన్న పరిస్థితిని చూసి నిందించుకోవడం చాలా మందికి అలవాటు. కానీ.. ఆటో డ్రైవర్​గా ఉన్నా, మనకంటూ ప్రత్యేకత ఎలా సంపాదించుకోవాలో చేసి చూపిస్తున్నాడు దురై. ఒక్కొక్క వినియోగదారుడిని ఒక్కో భాషలో 'హలో' అని పలకరించగలడు. అలా మొత్తం 9 భాషలు నేర్చేసుకున్నాడు. కస్టమర్​లతో స్నేహం చేస్తాడు. ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు.

hi-tech auto-rickshaw
ఆటో అన్నా

చదువుపై ఉన్న ఇష్టం కారణంగా.. ఇక ఉపాధ్యాయులకైతే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాడు దురై.

స్ఫూర్తినిస్తూ..

ఈ ఆటో అన్నకు సొంతంగా ఓ యాప్​ కూడా ఉంది. 'నిన్ను నువ్వు పరిచయం చేసుకునే అవసరం రానంతవరకు పనిచేస్తూనే ఉండు' అనేది ఇతడి ఫిలాసఫీ. కలలకు చదువు, లక్ష్యాలకు పరిస్థితులు అడ్డుకావని నిరూపిస్తున్న దురై.. టెడ్​ఎక్స్​ ప్రసంగాలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఆటో రిక్షాతో 'మొబైల్​ హౌస్'​.. మహీంద్రా ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.