ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: కీలక స్థానాల్లో జంప్​జిలానీల పాగా! - పార్టీ ఫిరాయింపుదారులు

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫిరాయింపులు భారీగా పెరిగాయి. కీలక నేతలు, ఎమ్మెల్యేలు అధికార టీఎంసీని వీడి భాజపాలో చేరారు. టీఎంసీలో కూడా ఇతర పార్టీల నేతలు వలస వచ్చారు. పూర్తి భిన్న ద్రువాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు.. టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం ఒక విషయంలో సారుప్యత కనబర్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిరాయింపుదారులకు టికెట్లు కేటాయించాయి. దీంతో బంగాల్​ రాజకీయ సంప్రదాయాన్ని ఈ పార్టీలు నాశనం చేశాయని సీపీఎం ఆరోపించింది.

Bengal Elections
హై ప్రోఫైల్​ సీట్లలో ఫిరాయింపుదారుల పాగా!
author img

By

Published : Mar 17, 2021, 6:02 PM IST

టీఎంసీ, భాజపా... బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు. విజయమే లక్ష్యంగా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి ఈ పార్టీలు. ఈ సంగ్రామంలో ఎవరి వ్యూహాలు వారివి. అయితే... పూర్తి భిన్న ధ్రువాలుగా కనిపిస్తున్న ఈ పార్టీల మధ్య ఓ సారూప్యత కనిపిస్తోంది. గెలుపు గుర్రాలంటూ ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశాయి టీఎంసీ, భాజపా. ఇప్పటికే సత్తా చాటుకున్న నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గణనీయమైన సంఖ్యలో సీట్లు కేటాయించాయి. ఈ వ్యూహం ఏమేర ఫలిస్తుందో స్పష్టత లేకపోయినా... ప్రస్తుతానికైతే రెండు పార్టీలు సొంత నేతల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి.

టీఎంసీలో 16 మంది..

అసెంబ్లీ ఎన్నికలకు 291 మంది అభ్యర్థులను ఖరారు చేసింది అధికార టీఎంసీ. అందులో 16 మంది ఫిరాయింపుదారులు ఉన్నారు.

భాజపాలో 22 మంది..

బంగాల్​ ఎన్నికల కోసం భాజపా ఇప్పటి వరకు ప్రకటించిన 122 మంది అభ్యర్థుల జాబితాలో 22 మంది ఫిరాయింపుదారులు ఉండటం గమనార్హం. అందులో ప్రధానంగా బంగాల్​ మాజీ మంత్రి సువేందు అధికారి, రాజీబ్​ బెనర్జీ వంటి టీఎంసీ మాజీ నేతలు ఉన్నారు.

అభ్యర్థుల ఎంపికపై ఆందోళనలు..

టీఎంసీ ఫిరాయింపుదారు, 80 ఏళ్ల వయసు పైబడిన రవీంద్రనాథ్​ ఘోష్​ను ఎంపిక చేయటం పట్ల హూగ్లీ జిల్లా భాజపా సీనియర్​ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు నిరసనకు దిగారు.

భాజపాలో చేరిన టీఎంసీ నేతలు సంతాను బాపులి, అర్ణబ్​ రాయ్​, దీపక్​ కుమార్​ రాయ్​, గోర్ఖా జనముక్తి మోర్చా ఫిరాయింపుదారు బిషాల్​ లామా, లెఫ్ట్​ డిఫెక్టర్​ రింకు నాస్కర్​, బిస్వనాత్​ కరక్​ ఎంపికను నిరసిస్తూ.. కోల్​కతా, ఉత్తర బంగాల్​ సహా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులకు ఈసారి మొండి చేయి చూపడంపై టీఎంసీ సైతం తమ మద్దతుదారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. సుమారు 160 స్థానాల్లో కొత్తవారిని పోటీకి దింపడం లేదా అభ్యర్థులను మార్చడం వంటివి చేసింది తృణమూల్​ కాంగ్రెస్.

సమర్థించుకున్న పార్టీలు..

అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొన్నప్పటికీ.. తమ నిర్ణయాలను సమర్థించుకున్నాయి రెండు పార్టీలు. విజయావకాశాలు ఉన్న వారికే ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పుకొచ్చాయి.

నిజానికి... ఫిరాయింపుదారులకు భాజపా టికెట్లు ఇవ్వడం అనివార్యంగా మారింది. ఇటీవల కాలంలో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో గణనీయంగా పుంజుకున్నా... 294 స్థానాలకు సరిపడా దీటైన అభ్యర్థులు లేరు. ఫలితంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయక తప్పలేదని చెబుతున్నారు కమలదళం నేతలు.

అయితే ఇలా చేయడం వల్ల పార్టీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చడమూ సీనియర్ నేతలకు సవాల్​గా మారింది.

" పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలు మాకు ఉన్నారు. బంగాల్​లో మా పార్టీ అభివృద్ధి చెందుతోంది. వీలైనంత మంది ప్రముఖులను మాతో చేర్చుకోవటం ఇప్పుడు తప్పనిసరి. ఇతర పార్టీల్లో గెలుపొంది మా పార్టీలోకి వచ్చిన వారందరికీ టికెట్లు అందవు. అలాగే.. ప్రతిఒక్కరినీ ఎన్నికల్లో నిలపటం సాధ్యం కాదు. "

- దిలీప్​ ఘోష్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

  • భాజపా 59 మందితో ప్రకటించిన తొలి జాబితాలో 8 మంది ఫిరాయింపుదారులు ఉన్నారు. అందులో సువేందు అధికారి, సీపీఎం మాజీ ఎమ్మెల్యే తపసి మండల్​ వంటి కీలక నేతలు ఉన్నారు.
  • రెండో జాబితాలోని 63 మందిలో 12 మంది ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరినవారే.
  • భాజపాలో టికెట్టు దక్కని 8 మంది నేతలు స్వతంత్రంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

వలసలతో భాజపాకు కొత్త చిక్కు

పార్టీలోకి వలసలు పెరిగిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది భాజపా. ఇబ్బందులను గ్రహించిన ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తన పర్యటనల్లో మార్పు చేసి రాష్ట్ర నాయకత్వంతో సమావేశమయ్యేందుకు ఇటీవల కోల్​కతాకు వెళ్లారు. మిగిలిన 172 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించటంపై పార్టీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

2019 లోక్​సభ ఎన్నికల తర్వాత 26 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీఎంసీ నుంచి, కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం నుంచి ముగ్గురు శాసనసభ్యులు భాజపాలో చేరారు. అందులో సువేందు అధికారి, బెనర్జీ, రాజ్యసభ ఎంపీ దినేశ్​ త్రివేది మినహా ఎవరూ ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేయలేదు.

టీఎంసీలోనూ అంతర్గత కుమ్ములాట..

పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించిన క్రమంలో అధికార టీఎంసీలోనూ అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. మాల్దా, ఉత్తర దినాజ్​పుర్​, ముర్షీదాబాద్​, సిలిగుడి, నదియా వంటి క్లిష్టమైన స్థానాల్లో ఫిరాయింపుదారులకు టికెట్లు కేటాయించింది పార్టీ. కాంగ్రెస్​, వామపక్షాల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

కాంగ్రెస్​ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, టీఎంసీ రాజ్యసభ ఎంపీ మానస్​ రంజన్​ భూనియా.. తన సొంత నియోజకవర్గం సబాంగ్​ నుంచి టీఎంసీ టికెట్​పై బరిలో నిలుస్తున్నారు. ఇటీవలే తృణమూల్​ కాంగ్రెస్​లో చేరిన భాజపా ఎంపీ సౌమిత్రా ఖాన్​ భార్య సుజాత మండల్​కు సైతం టికెట్​ దక్కింది.

" ఫిరాయింపుదారులకు మూడు కారణాలతో టికెట్లు కేటాయించాం. గత ఎన్నికల్లో మాతో సంబంధంలేని వారిని బరిలో నిలపటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తొలగించాలనుకున్నాం. అలాగే పలు ప్రాంతాల్లో పార్టీకి ప్రముఖులు లేరు. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు కొత్త వారిని తెరపైకి తీసుకురావాలని అనుకున్నాం. ఈ ఎన్నికల్లో టికెట్లు పొందిన ఫిరాయింపుదారులు 2-3 ఏళ్ల క్రితమే పార్టీలో చేరారు. సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు టికెట్టు కేటాయించని స్థానాల్లోనే ఆందోళనలు ఎదురయ్యాయి. "

- టీఎంసీ నేత.

సీపీఎం విమర్శలు..

టీఎంసీ, భాజపా.. ఆయారాం, గయారాం రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించింది సీపీఎం. బంగాల్​ రాజకీయ సంప్రదాయాన్ని నాశనం చేశాయని ఆరోపించింది.

" ఇతర పార్టీలో ఎన్నికైన వారిని మేము ఎప్పుడూ చేర్చుకోలేదు. బంగాల్​ రాజకీయ సంప్రదాయాల్ని మొదట టీఎంసీ నాశనం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు భాజపా దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లింది. ఎన్నికల బరిలో పార్టీ ఫిరాయింపుదారులు ఈ స్థాయిలో నిలిచినట్లు గతంలో ఎన్నడూ చూడలేదు. "

- సుజన చక్రబర్తి, సీపీఎం నేత

ఇవీ చూడండి: బంగాల్​ దంగల్: బుద్ధిజీవుల ప్రసన్నతే లక్ష్యం

బంగాల్​ దంగల్​: రాజకీయ సిద్ధాంతాల్ని మరచిన నేతలు!

బంగాల్​ దంగల్​: గాయాలే దీదీ విజయానికి సోపానాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.