ETV Bharat / bharat

కర్ణాటకలో సిక్కు బాలుడికి అడ్మిషన్​ నిరాకరణ.. చివరకు చర్చలతో..

Hijab Row: తలపాగా ధరించిన కారణంగా ఆరేళ్ల సిక్కు బాలునికి పాఠశాలలో అడ్మిషన్ నిరాకరించిన వివాదం చర్చలతో సద్దుమణిగింది. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సిక్కుల తలపాగా అంశం కూడా తెరమీదికొచ్చింది.

hijab
సిక్కు తలపాగా
author img

By

Published : Feb 27, 2022, 11:05 AM IST

Updated : Feb 27, 2022, 12:20 PM IST

Hijab Row: కర్ణాటకలో తలపాగా ధరించిన కారణంగా ఆరేళ్ల సిక్కు బాలునికి పాఠశాలలో అడ్మిషన్ నిరాకరించిన వివాదం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. దక్షిణ కన్నడ జిల్లాలో తలపాగా ధరించిన బాలున్ని చేర్పించడానికి అతని తండ్రి పాఠశాలకు తీసుకువెళ్లాడు. తలపాగా తీసివేస్తేనే చిన్నారికి స్కూల్​లో అడ్మిషన్ ఇస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. చర్చల అనంతరం ఈ వివాదం ముగిసిందని బాలుని తండ్రి తెలిపాడు. బాలుని తండ్రి నేషనల్ సిక్కు ఆర్గనైజేషన్​ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Hijab Sikh Turban: కర్ణాటకలో ఫబ్రవరి 24న ఇలాంటి మరో ఘటన జరిగింది. మౌంట్​ కార్మెల్ పీయూ కాలేజ్​లో 17 ఏళ్ల సిక్కు బాలికను తలపాగా తొలగించాలని కోరింది యాజమాన్యం. తరగతి గదుల్లో మతపరమైన దుస్తులు ధరించకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విద్యార్థులు పాటించాలని కాళాశాల ప్రిన్సిపల్ కోరారు.

హైకోర్టు ఆదేశాలు

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా విద్యార్థులు ఎవరూ మతపరమైన దుస్తులు(హిజాబ్, కాషాయ కండువాలు) ధరించొద్దని ఆదేశించింది. అందరూ యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ వివాదం..

గతేడాది డిసెంబర్​ చివర్లో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించిన కొందరు మహిళలను ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీనిపై నిరసన వ్యక్తమైంది. దీంతో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు ఫిబ్రవరి 9న సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశానుసారం ఫిబ్రవరి 14న పాఠశాలలను, 16న కళశాలలను తెరిచారు. కాగ, ఈ వ్యవహారంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: Hijab row: సిక్కు విద్యార్థినికీ 'హిజాబ్' సెగ.. తలపాగా తొలగించాలని..

Last Updated : Feb 27, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.