ETV Bharat / bharat

TSPSC లీకేజీ కేసు.. గ్రూప్-1 పేపర్ ఐదుగురికే చేరినట్టు ఆధారాలు - Hyderabad Latest News

TSPSC Paper Leak Case Latest Updates: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. గ్రూప్‌-1 రాసిన 84 మందిని విచారించిన సిట్‌.. ప్రిలిమినరి ప్రశ్నాపత్రం ఐదుగురికే చేరినట్టు ఆధారాలు సేకరించింది. ఏఈ ప్రశ్నాపత్రం 12 మందికి చేరినట్లు తేల్చింది. మరోవైపు చంచల్‌గూడ జైళ్లో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, రమేశ్ , సురేశ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఐదు రోజుల పాటు విచారించనున్నారు.

TSPSC paper leak case
TSPSC paper leak case
author img

By

Published : Mar 29, 2023, 6:10 PM IST

Updated : Mar 29, 2023, 7:43 PM IST

TSPSC Paper Leak Case Latest Updates: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం.. కీలక విషయాల్ని రాబడుతోంది. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కేవలం ఐదుగురికి మాత్రమే చేరి ఉండొచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్​ను ప్రశ్నించినప్పుడు ఐదు పేర్లు మాత్రమే బయటపడ్డాయి. టీఎస్​పీఎస్సీలో ఏఎస్ఓగా పనిచేస్తున్న ప్రవీణ్ తన కోసమే గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడని.. ఆ తర్వాత తన సహోద్యోగులైన షమీమ్, రమేష్​తో పాటు సురేష్​కు ఇచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.

రాజశేఖర్ రెడ్డి తన బావ ప్రశాంత్ రెడ్డికి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని అందించాడని సిట్ అధికారులు గుర్తించారు. నిందితులను రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా ఈ విషయంలో ఐదుగురు పేర్లే బయటికి వచ్చాయని సిట్ అధికారులు చెబుతున్నారు. నిందితులు నోరు విప్పడం లేదా లేకపోతే ఆ గ్రూపు వరకే ప్రశ్నాపత్రాలు పరిమితమయ్యాయా అనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

ఏఈ ప్రశ్నాపత్రం మాత్రం 12మందికి చేరినట్లు: ఏఈ ప్రశ్నాపత్రం మాత్రం 12మందికి చేరినట్లు సిట్ అధికారులు తేల్చారు. డాక్యా, రాజేశ్వర్ నాయక్ కలిసి పలువురికి విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసి పరీక్ష రాసిన నలుగురు అభ్యర్థులను.. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మిగతా 8 మంది ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. గ్రూప్-1 పరీక్ష రాసి 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిలో ఇప్పటికే 84 మందిని సిట్ అధికారులు ప్రశ్నించారు.

మిగతా వారి నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు షమీమ్, రమేష్, సురేష్​లను మొదటి రోజు కస్టడీలో భాగంగా ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాన్ని ఇంకెవరికైనా విక్రయించారా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారించేందుకు మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్‌ కోరింది. నిందితులు ప్రశాంత్, తిరుపతయ్య, రాజేందర్‌లను వారం రోజులు కస్టడీకి అనుమతివ్వాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పోలీస్ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారించనుంది.

ఇవీ చదవండి: 'KTR నోటీసులపై బండి సంజయ్ స్పందన.. ఆయన పరువు ఖరీదు రూ.100కోట్లా?'

'పేపరు లీకేజీపై సీబీఐ విచారణ జరగాలి'

ఎమ్మెల్సీ కవితపై ట్రోలింగ్... వారికి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల నోటీసులు

లొంగిపోయేందుకు అమృత్​పాల్ రెడీ.. ఆయనతో మీటింగ్ తర్వాతే పోలీసుల వద్దకు..

Last Updated : Mar 29, 2023, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.