ETV Bharat / bharat

Margadarsi Chits: మార్గదర్శి ఉద్యోగులపై కఠిన చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు

TS High Court on margadarsi chit fund: మార్గదర్శి ప్రధాన కార్యాలయ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవద్దని... ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతోపాటు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, సీఐడీ డీఎస్పీ, పలువురు రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కేసుల దర్యాప్తులో చట్టప్రకారం వ్యవహరించడం లేదన్న న్యాయవాదులు... ఉద్యోగులను సీఐడీ వేధిస్తోందని హైకోర్టుకు నివేదించారు. రాజకీయ అధినేతను సంతృప్తి పరిచే ప్రయత్నంలో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

margadarsi
మార్గదర్శి
author img

By

Published : Apr 13, 2023, 10:15 PM IST

Updated : Apr 14, 2023, 6:50 AM IST

TS High Court on Margadarsi Chit Funds: ఆంధ్రప్రదేశ్​లో నమోదైన కేసుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని, చట్టప్రకారం దర్యాప్తు చేసేలా ఆదేశించాలంటూ.. మార్గదర్శి కార్పొరేట్‌ కార్యాలయానికి చెందిన డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ బి.రామకృష్ణారావు, మరో 14 మంది జనరల్‌ మేనేజర్లు, సహాయ జనరల్‌ మేనేజర్లు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టగా.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, న్యాయవాది వాసిరెడ్డి విమల్‌వర్మ వాదనలు వినిపించారు.

బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మార్గదర్శిలో సోదాలు కొనసాగాయని.. పిటిషనర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకున్న ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి.. సోదాలు ముగిశాయని, ఒక్క ఉద్యోగి జోలికీ వెళ్లలేదని చెప్పారు. అందువల్ల పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్లు బుధవారం హైకోర్టును ఆశ్రయించి మౌఖికంగా అభ్యర్థించారని, సాంకేతిక అభ్యంతరాల నేపథ్యంలో అఫిడవిట్‌ దాఖలు చేశారని చెప్పారు. అరెస్ట్‌ చేయడం లేదన్న వాదనను రికార్డు చేసి పిటిషన్లపై విచారణ మూసివేస్తామన్నారు. అలాంటి హామీ ఇవ్వలేమన్న ఏపీ న్యాయవాది.. ప్రస్తుతం ఎలాంటి చర్య లేనందున ఉత్తర్వులు అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చినట్లు చెప్పారు.

దర్యాప్తు అధికారి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ తీరు అభ్యంతరకరంగా ఉందని.. పిటిషనర్ల తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. అధికారులు నమోదు చేసిన కేసులో పిటిషనర్లు నిందితులు కాకపోయినా.. దర్యాప్తు పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. చట్టప్రకారం దర్యాప్తు చేయాలనే తాము కోరుతున్నామని అన్నారు. దురుద్దేశంతో ఒకే అంశానికి సంబంధించి పలు కేసులు నమోదు చేస్తుండటంపై ఇదే హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు చెబుతున్నారని... దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించరాదని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని ప్రస్తావించారు.

దర్యాప్తులో ప్రతి అంశాన్నీ బయటికి వెల్లడిస్తున్నట్లు హైకోర్టుకు నివేదించారు. బుధవారం సీఐడీ అదనపు డీజీ విలేకరుల సమావేశం నిర్వహించారని తెలియజేశారు. మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలను అరెస్ట్‌ చేయాలన్న పథకం విఫలం కావడంతో.. రాజకీయ అధినేతను సంతృప్తిపరిచే కార్యక్రమంలో భాగంగా సంస్థ ఉద్యోగులపై దృష్టి సారించారన్నారు. ఇప్పటికే నలుగురు బ్రాంచ్‌ మేనేజర్లను, ఆడిటర్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. విచారణ కోసం ఆడిటర్‌ కె.శ్రావణ్‌ను పిలిచి ఒకరోజు పాటు నిర్బంధించారని, అప్పుడే ఆయన మెడపై గాయమైందని.. ఆ తర్వాత అరెస్ట్‌ చూపారని కోర్టు దృష్టికి తెచ్చారు. అందువల్లే కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. విచారణకు తాము సహకరిస్తున్నామని.. బయటి శక్తుల ప్రభావంతో, దురుద్దేశంతో, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు. బుధవారం మార్గదర్శిలో జరిగిన సోదాల సందర్భంగా అనుకూల స్టేట్‌మెంట్లు ఇప్పించేలా ఉద్యోగులను భయపెట్టడానికి ప్రయత్నించారన్నారు. మార్గదర్శి సమాచారమంతా చిట్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఉన్నప్పటికీ, అధికారులు సోదాలు నిర్వహించారని కోర్టుకు తెలిపారు.

పత్రికా కథనాల ఆధారంగా ఆరోపణలు చేయరాదని, వాటిని పరిగణనలోకి తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని.. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది గోవిందరెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. సమాచారం లీకేజీ విషయం వివాదాస్పదమైన సంఘటనను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయినా లీకేజీపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని, కౌంటర్లు దాఖలు చేయాలని సూచించారు. ఎలాంటి చర్యలు లేకుండా ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని, దీనికి సంబంధించిన పలు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఏపీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్ట్‌ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్న వారి న్యాయవాది వాదనల నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను తిరస్కరించలేమని ఈ కోర్టు అభిప్రాయపడుతోందన్నారు. ఛైర్మన్‌, ఎండీలతోపాటు 30 మంది బ్రాంచ్‌ మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఈ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు లీక్‌ చేయరాదంటూ ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. వీటిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను 28కి వాయిదా వేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శికి సంబంధించి నమోదైన కేసులో భాగంగా బ్రహ్మయ్య అండ్‌ కొ ఆడిట్‌ కంపెనీలో సీఐడీ నిర్వహించిన సోదాలు, స్వాధీనం చేసుకున్న సమాచారంపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను.. తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 28 వరకు పొడిగించింది. సోదాల కోసం మార్చి 28న ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ బ్రహ్మయ్య అండ్‌ కొ, భాగస్వామి పి.చంద్రమౌళి దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారంతో ముగిసిపోతున్నందున, వాటిని పొడిగించాలంటూ పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 14, 2023, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.