ETV Bharat / bharat

అభిశంసన 2.0: ట్రంప్​ గట్టెక్కుతారా?

అమెరికా ప్రతినిధుల సభలో అధ్యక్షుడు ట్రంప్​పై అభిశంసన అస్త్రాన్ని డెమొక్రాట్లు బుధవారం ప్రయోగించే అవకాశముంది. ఇదే జరిగితే పదవీకాలంలో రెెండోసారి అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నారు ట్రంప్​. సాధారణంగా నెలల పాటు సాగే ఈ ప్రక్రియను.. క్యాపిటల్​లో హింస నేపథ్యంలో వారం రోజుల్లోనే ముగించేందుకు చూస్తున్నారు డెమొక్రాట్లు.

Trump on verge of 2nd impeachment after Capitol siege
ట్రంప్​పై అభిశంసన అస్త్రం- ఈసారైనా గట్టెక్కేనా?
author img

By

Published : Jan 13, 2021, 5:17 PM IST

Updated : Jan 13, 2021, 5:25 PM IST

క్యాపిటల్​ భవనంలో హింస నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై తీవ్ర అసహనంతో ఉన్న డెమొక్రాట్లు.. ఆయనపై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. బుధవారం అభిశంసనకు సంబంధించి ప్రతినిధుల సభలో ఓటింగ్​ జరిగే అవకాశముంది. ఇదే జరిగితే.. పదవీకాలంలో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా.. అమెరికా చరిత్రలో నిలిచిపోతారు ట్రంప్​. ఇప్పటికే ఓసారి అభిశంసనను ఎదుర్కొన్న ట్రంప్​.. రిపబ్లికన్ల మద్దతుతో సునాయాసంగా గటెక్కారు. కానీ క్యాపిటల్​లో జరిగిన హింస నేపథ్యంలో ఈసారీ బయటపడతారా? లేదా? అన్నది సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది.

వారం రోజుల్లోనే..

సాధారణ పరిస్థితుల్లో.. అభిశంసన ప్రక్రియలో భాగంగా దర్యాప్తు జరుగుతుంది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తారు. ఈ ఆధారాలను జ్యుడిషియరీ కమిటీకి పంపిస్తారు. అక్కడ విచారణ జరిపి.. అనంతరం ఆ ఆర్టికల్​ డ్రాఫ్ట్​ను ప్రతినిధుల సభకు పంపిస్తారు.

ట్రంప్​పై జరిపిన తొలి అభిశంసనలో ఇదే జరిగింది. ఉక్రెయిన్​ అధ్యక్షుడితో సంబంధాలపై మూడు నెలల పాటు ఆభిశంసన ప్రక్రియను ఎదుర్కొన్నారు ట్రంప్​.

ఇదీ చూడండి- నాపై అభిశంసన తీర్మానం హాస్యాస్పదం: ట్రంప్​

కానీ ఇప్పుడు అంత సమయం లేదు. ఫలితంగా ప్రక్రియ అంతా వారం రోజుల్లోనే ముగిసేలా కనపడుతోంది. ఇందుకు కారణం క్యాపిటల్​ భవనంలో జరిగిన హింస.

హింసాకాండకు కొద్ది గంటల ముందు.. తన మద్దతుదారులను ట్రంప్​ ప్రేరేపించారని డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్లూ విశ్వసిస్తున్నారు. ట్రంప్​ ప్రసంగానికి సంబంధించిన వీడియోలను అందరూ చూశారు.

ఈ నేపథ్యంలో అభిశంసన ప్రక్రియ ఈసారి నేరుగా ప్రతినిధుల సభకే చేరింది. బుధవారం ఈ వ్యవహారంపై చట్టసభ్యులు ఓటు వేయనున్నారు.

ప్రతినిధుల సభలో అభిశంసన గట్టెక్కితే.. ఈ ఆర్టికల్​ను సెనేట్​కు పంపిస్తారు. అక్కడ విచారణ జరిపి, అభిశంసనకు ఓటు వేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.

ఇదీ చూడండి:- క్యాపిటల్ హింసాకాండలో పైపు బాంబులు

రిపబ్లికన్ల మద్దతు...

2019లో ట్రంప్​పై వేసిన అభిశంసన వీగిపోవడానికి ముఖ్యకారణం రిపబ్లికన్లు. అధ్యక్షుడి వెన్నంటే నిలిచి.. ఆయన్ను కష్టాల నుంచి గట్టెక్కించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అధ్యక్షుడి ప్రవర్తనతో.. రిపబ్లికన్​ పార్టీ రెండుగా చీలిపోయింది. ఈసారి జరిగే అభిశంసనకు పలువురు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభిస్తోంది. ట్రంప్​కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఇప్పటికే ఐదుగురుకుపైగా రిపబ్లికన్లు స్పష్టం చేశారు.

సెనేట్​కు ఎప్పుడు?

ప్రతినిధుల సభలో అభిశంసన గట్టెక్కిన తర్వాత.. సెనేట్​కు పంపించడంపై తుది నిర్ణయం స్పీకర్​ పెలోసీదే. అయితే ప్రస్తుత షెడ్యూల్​ ప్రకారం.. ఈ నెల 19 వరకు సెనేట్​ సమావేశాలు లేవు.

అధ్యక్షుడిగా ఈ నెల 20న జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అప్పటివరకు పెలోసీ వేచి చూసే అవకాశముందని పలువురు డెమొక్రాట్లు భావిస్తున్నారు. కానీ అంతకు ముందే ఈ వ్యవహారాన్ని ముగించాలని మరికొందరు పెలోసీని అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చూడండి:- 'బైడెన్​ ప్రమాణస్వీకారం రోజు అమెరికాలో అల్లర్లు!'

సెనేట్​లో గట్టెక్కేనా?

ట్రంప్​ అభిశంసన సెనేట్​లో గట్టెక్కాలంటే.. మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతానికి అభిశంసనకు అంత మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అనేక మంది రిపబ్లికన్లు.. ట్రంప్​ రాజీనామా చేయాలని కోరుతున్నారు. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టే ఆర్టికల్​ను పరిశీలిస్తామని అంటున్నారు. కానీ సెనేట్​ ముందుకు అభిశంసన ప్రక్రియ వస్తే.. ట్రంప్​కు వ్యతిరేకంగా ఓటు వేస్తారా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం లేదు.

అయితే సెనేట్​లో గట్టెక్కకపోయినా... అభిశంసన ప్రక్రియతో ముందుకు వెళ్లాలని డెమొక్రాట్లు దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇది యావత్​ దేశానికి ఓ సందేశాన్ని ఇస్తుందని విశ్వసిస్తున్నారు. ట్రంప్​ను మరోమారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకుంటుందని భావిస్తున్నారు.

'రాజీనామా చేసే ప్రసక్తే లేదు..'

ఏది ఏమైనా రాజీనామా చేసే యోచనలో ట్రంప్​ లేరని సమాచారం. ఈ నెల 19న ఫ్లోరిడాకు వెళ్లి అక్కడే ఉంటారని తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి.. బైడెన్​ పాలనను నిశితంగా పరిశీలిస్తారని ట్రంప్​ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:- '25వ సవరణతో నాకేం ముప్పు లేదు.. కానీ'

Last Updated : Jan 13, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.