ETV Bharat / bharat

మురికివాడలోనే ఆ నగర మేయర్​ నివాసం

బాగా ఆస్తిపాస్తులు ఉన్నావాళ్లే రాజకీయ నాయకులుగా చలామణీ అవుతుంటారు! కానీ, గుజరాత్​ అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నం. గతంలో రెండుసార్లు కౌన్సిలర్​గా పని చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ ఓ మురికివాడలో నివసిస్తున్నారు. ఇప్పుడు అహ్మదాబాద్​ మేయర్​గా ఎన్నికైన ఆయన సాధారణ జీవనం గురించి గుజరాత్​వాసులంతా మాట్లాడుకుంటున్నారు.

Truely a Common Man, the new Mayor of Ahmedabad lives in a slum,
మురికివాడలోనే ఆ నగర మేయర్​ నివాసం
author img

By

Published : Mar 20, 2021, 11:54 AM IST

అహ్మదాబాద్​ మేయర్​ కిరీట్​ పర్మార్​ నివాసం

రెండు పర్యాయాలు కౌన్సిలర్​గా పనిచేశారు. ఇప్పుడు మేయర్​గా ఎన్నికయ్యారు. అలాంటి వ్యక్తి ఇంట్లో ఒక్కటంటే ఒక్క లగ్జరీ వస్తువు లేదంటే నమ్మగలరా? కానీ, గుజరాత్​ అహ్మాదాబాద్​కు చెందిన కిరీట్ పర్మార్​​ ఇంటిని చూస్తే నమ్మక తప్పదు. అహ్మదాబాద్​ మేయర్​గా ఇటీవలే ఎన్నికైన ఆయన ఓ మురికివాడలో నివసిస్తూ.. తన నిరాడంబరతతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

Truely a Common Man, the new Mayor of Ahmedabad lives in a slum,
అహ్మదాబాద్​ మేయర్​ కిరీట్​ పర్మార్​ ఇల్లు

అవివాహితుడు..

బాల్యం నుంచే కిరీట్​.. రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​లో సభ్యుడిగా సేవలందిస్తున్నారు. సంఘ్​ శాఖను ఆయన నిత్యం సందర్శిస్తూ ఉంటారు. స్థానికులనే తన కుటుంబ సభ్యులుగా భావించే కిరీట్​.. పెళ్లి కూడా చేసుకోలేదు.

"ఆర్​ఎస్​ఎస్​లో చేరాక.. సమాజానికి, దేశానికి సేవ చేయాలనే లక్ష్యం నాకు ఏర్పడింది. అందుకే.. నేను ఒంటరిగా ఉండాలనుకున్నాను. ఎన్నో ఏళ్లుగా నేను స్లమ్​లోనే ఉంటున్నాను. ఇక్కడ నివసించే వాళ్లే నా కుటుంబ సభ్యులు."

-కిరీట్ పర్మార్​.

పార్టీకి ధన్యవాదాలు..

శుక్రవారం ఉదయమే అహ్మదాబాద్​ మేయర్​గా కిరీట్​ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ వ్యక్తి అయిన తనను మేయర్​గా ఎంపిక చేసినందుకు కిరీట్ సంతోషం వ్యక్తం చేశారు.

అహ్మదాబాద్​ నూతన మేయర్​ కిరీట్​ పర్మార్​

"స్లమ్​లో నివసించే నాకు ఇంత పెద్ద పదవీ బాధ్యతలు ఇచ్చినందుకు భాజపాకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు.. సామాన్యులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయి."

-కిరీట్ పర్మార్​.

మాజీ మేయర్​ కూడా..

కిరీట్​ కంటే ముందు అహ్మదాబాద్​ మేయర్​గా కానాజీ ఠాగూర్​​ ఉండేవారు. ఆయన కూడా కిరీట్​ లానే సాధారణ జీవితం గడిపేవారు. మేయర్​గా ఎన్నికైన తర్వాత.. ప్రభుత్వం ఆయనకు ఓ ఇల్లు కేటాయించింది. అయితే.. దాన్ని తిరస్కరించిన కానాజీ.. మధుపురగామ్​ ప్రాంతంలో ఒకే గది ఉన్న ఓ​ ఇంట్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అహ్మాదాబాద్​ కార్పొరేషన్​ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.

ఇదీ చూడండి:20ఏళ్లుగా వానరాల ఆలనా పాలనే ఆమె దినచర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.