ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ సీఎం రావత్​ రాజీనామా

ఉత్తరాఖండ్​ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగాయి. సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​.. తన పదవికి రాజీనామా చేశారు. అసమ్మతి ఎదురైన కారణంగా ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

trivendra-singh-resigns-as-uttarakhand-cm
త్రివేంద్ర రాజీనామా
author img

By

Published : Mar 9, 2021, 4:21 PM IST

Updated : Mar 9, 2021, 6:18 PM IST

ఉత్తరాఖండ్​లో నాయకత్వ మార్పుపై గత కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​.. తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్​ రాణి మౌర్యను మంగళవారం సాయంత్రం కలిసిన రావత్​.. రాజీనామా లేఖను సమర్పించారు.

అనంతరం.. మీడియాతో మాట్లాడారు రావత్​. తాను ఎన్నడూ ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని.. కానీ నాలుగేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగానని చెప్పారు. ఆ అవకాశం ఇచ్చిన భాజపా అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు పార్టీ ఆదేశాలతో సీఎం బాధ్యతలు చేపట్టానని.. ఇప్పుడు హైకమాండ్​ నిర్ణయంతో పదవిని వీడానని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా.. 'రాజీనామా వెనకున్న అసలు కారణం ఏంటి?' అని విలేకరులు ప్రశ్నించారు. దానికి సమాధానం కావాలంటే.. అందరూ దిల్లీ వెళ్లాలని అన్నారు రావత్​.

బుధవారం భాజపా కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని.. అందులో తదుపరి సీఎంను ఎన్నుకుంటారని రావత్​ స్పష్టం చేశారు.

అదే కారణం...!

సొంత పార్టీలో త్రివేంద్ర సింగ్​కు అసమ్మతి సెగ తగిలింది. మంత్రులతో పాటు 20మంది ఎమ్మెల్యేలు.. రావత్​పై గత వారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఉత్తరాఖండ్​ భాజపాలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ.. ఈ నెల 8న నివేదికను సమర్పించింది.

మరోవైపు.. రావత్​ ధోరణి కూడా ఈ పరిణామాలకు ఓ కారణంగా తెలుస్తోంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, చర్యలు చేపట్టడం రావత్​ శైలి. దీనిపై పార్టీలోని పలువురు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఆయన పనితీరు కూడా సరిగా లేదని పార్టీలో అంతర్గత నివేదికలు పేర్కొన్నట్టు సమాచారం.

రేసులో..

రావత్​ రాజీనామాతో.. తదుపరి సీఎం ఎవరవుతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో రాష్ట్ర మంత్రి ధన్​ సింగ్​ రావత్​, ఎంపీలు అజయ్​ భట్​, అనిల్​ బలుని ఉన్నట్టు తెలుస్తోంది. ఓ డిప్యూటీ సీఎంను కూడా నియమించే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. పుష్కర్​ సింగ్​ ధమికి ఆ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:- ఆ రాష్ట్ర భాజపాలో అసమ్మతి.. అధిష్ఠానానికి నివేదిక

Last Updated : Mar 9, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.