ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భాజపా కార్యకర్తల మృతి - ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్

త్రిపురలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆ రాష్ట్ర సీఎం బిప్లవ్​ కుమార్ దేవ్​​ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరై తిరిగి వస్తున్న భాజపా కార్యకర్తలని పోలీసులు తెలిపారు.

Tripura accident: 4 dead, 17 injured while returning from CM rally
త్రిపురలో రోడ్డు ప్రమాదం ఐదుగురు భాజపా కార్యకర్తలు మృతి
author img

By

Published : Mar 26, 2021, 10:01 PM IST

త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం అమర్‌పూర్ తాలూకా బీర్‌గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లార్కిర్ డుకాన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అమర్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.

ముఖ్యమంత్రి బిప్లవ్​ కుమార్ దేవ్​ నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీరంతా.. ట్రక్కులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘాట్​రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి ఉండొచ్చని ప్రబీర్ పాల్ అనే పోలీసు అధికారి వివరించారు.

పార్టీ కార్యకార్తల మరణంపై ముఖ్యమంత్రి బిప్లవ్​​ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఇదీ చదవండి: చేతిలో డబ్బు లేకున్నా ఎన్నికల బరిలోకి గొగొయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.