ETV Bharat / bharat

'డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్​ను తొలగించండి'

డిప్యూటీ ఎలక్షన్​ కమిషనర్​ సుదీప్​ జైన్​ భాజపాకు అనూకూలంగా వ్యవహరిస్తున్నారని తృణమూల్​ కాంగ్రెస్​ ఆరోపించింది. వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని ఈసీకి లేఖ రాసింది.

Trinamool
'ఈసీ డిప్యూటీ కమిషనర్​ సుదిప్​ జైన్​ను తొలగించండి'
author img

By

Published : Mar 4, 2021, 10:27 PM IST

Updated : Mar 4, 2021, 10:34 PM IST

డిప్యూటీ ఎలక్షన్​ కమిషనర్​ సుదీప్​ జైన్​ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తృణమూల్​ కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

"డిప్యూటీ ఎన్నికల కమిషనర్​ సుదీప్​ జైన్​ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలి. దీనికి సంబంధించిన లేఖను ఎలక్షన్ కమిషన్​కు.. మా పార్టీ అధికార ప్రతినిధి డెరెక్​ ఓబ్రెయిన్​ అందజేశారు."

-సౌగతా రాయ్​, తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ

2019లో లోక్​సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కోల్​కతాలో అమిత్​ షా పర్యటించారు. అప్పుడు భాజపా, తృణమూల్​ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ సమయంలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. విగ్రహాన్ని భాజపా కార్యకర్తలే ధ్వంసం చేశారని తృణమూల్​ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలను భాజపా ఖండించింది. అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కాగా అప్పడు ఎన్నికల విధులు నిర్వర్తించిన సుదీప్​ జైన్​ తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లే ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకుండా ఈసీ నిషేధం విధించిందని సౌగతా రాయ్​ ఆరోపించారు. మళ్లీ ఆయన భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందుకే జైన్​ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడినప్పటి నుంచి ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని తృణమూల్​ పార్టీ ఆరోపిస్తోంది. ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందనడానికి రాష్ట్రంలో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించలని నోటిఫికేషన్​ ఇవ్వడమే చక్కని ఉదాహరణ అని పేర్కొంది.

ఇదీ చూడండి: టీఎంసీ నుంచి భాజపా గూటికి మరో కీలక నేత

Last Updated : Mar 4, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.