ETV Bharat / bharat

Mamata banerjee news: భవానీపుర్​ అభ్యర్థిగా మమతా బెనర్జీ - పశ్చిమ బెంగాల్

బంగాల్​లోని భవానీపుర్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో (mamata banerjee news) సీఎం మమతా బెనర్జీ పోటీచేయనున్నట్లు తృణమూల్​ కాంగ్రెస్​ ప్రకటించింది. సెప్టెంబరు 30న.. భవానీపుర్​ సహా రాష్ట్రంలోని జంగీపుర్, సంసీర్​గంజ్ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరగనున్నాయి.

mamata banerjee
భవానీపుర్​ అభ్యర్థిగా మమతా బెనర్జీ
author img

By

Published : Sep 5, 2021, 7:13 PM IST

Updated : Sep 5, 2021, 8:19 PM IST

త్వరలో బంగాల్​లో భవానీపుర్ నియోజకవర్గానికి జరగనున్న​ ఉపఎన్నికలకు అభ్యర్థిగా సీఎం మమతా బెనర్జీ (mamata banerjee news) పేరును ప్రకటించింది తృణమూల్​ కాంగ్రెస్. ఈ ఉపఎన్నిక తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీకి కీలకం కానుంది. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మమత.. ఇందులో గెలిస్తేనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా పనిచేసే వారు ఆ పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉండటం ఇందుకు కారణం.

రాష్ట్రం​లోని జంగీపుర్, సంసీర్​గంజ్, భవానీపుర్​లలో (bhabanipur election) సెప్టెంబరు 30న ఉపఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. జంగీపుర్​, సంసీర్​గంజ్​ల నియోజకవర్గాలకు తృణమూల్​ అభ్యర్థులుగా జకీక్​ హుస్సేన్, అమీరుల్​ ఇస్లాం బరిలో నిలవనున్నారు.

ఉపఎన్నికలపైన ఈసీ.. సోమవారం నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. అక్టోబరు 3న ఈసీ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తుంది. దీదీ.. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఎన్నికలలో గెలిచి, నవంబరు 5లోగా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. భవానీపుర్ నియోజకవర్గం నుంచి దీదీ గతంలో రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించారు.

ఇదీ చదవండి : ముగ్గురు పిల్లల్ని డ్యాంలో తోసేసి.. భార్యను గొడ్డలితో నరికి..

Last Updated : Sep 5, 2021, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.