డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ కుమారుడు సూర్య శివను గురువారం రాత్రి తిరుచ్చి కంటోన్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. జూన్11 అర్ధరాత్రి సూర్య శివ కారును శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అనంతరం డ్రైవర్‌ను బెదిరించి సూర్య శివ బస్సును తీసుకెళ్లాడని కేసు నమోదైంది. సూర్య శివ అరెస్టుకు నిరసనగా 20మంది భాజపా కార్యకర్తలతో జిల్లా నాయకుడు రాజశేఖర్.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూర్య శివ ప్రస్తుతం భాజపా ఓబీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
"నా కారును ఢీకొన్న బస్సుకు పర్మిట్, ఇన్సూరెన్స్ లాంటి పత్రాలేవీ లేవు. శ్రీకృష్ణా ట్రావెల్స్ పర్మిట్ లేకుండా నకిలీ పత్రాలతో ఇప్పటి వరకు 20కి పైగా బస్సులను నడుపుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, మరో మంత్రి మహేష్ పొయమొళి ఆదేశాల మేరకే శ్రీకృష్ణ ట్రావెల్స్ నాపై తప్పుడు కేసులు పెట్టింది. డీఎంకేలోని కీలక మంత్రుల రహస్యాలు బయటపెడితే వారు బయట తిరగలేరు. మహేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైతే ఆయనతో ముఖాముఖికి నేను సిద్ధం."
-తిరుచ్చి సూర్య శివ
ఇవీ చదవండి: 'అగ్నిపథ్‌లో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు'