Trichy Airport PM Modi : ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తమిళనాడు తిరుచ్చిలో అభివృద్ధి చేసిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఆకట్టుకుంటోంది. ప్రయాణికులకు ఆలయ గోపురం ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని డిజైన్ చేశారు. నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
టెర్మినల్ ప్రత్యేకతలు
తమిళనాడులో చెన్నై తర్వాత అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా తిరుచ్చి విమానాశ్రయానికి పేరుంది. ఈ నేపథ్యంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ నిర్మించారు. రూ.1100 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ నూతన టెర్మినల్ ద్వారా ఏటా 44 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతేకాకుండా రద్దీ సమయాల్లో ఏకంగా 3,500 మంది వరకు ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని ఈ టెర్మినల్ కలిగి ఉందని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
కొత్త టెర్మినల్ భవనంలో సౌకర్యాలు ఇలా ఉన్నాయి.
- 60 చెక్-ఇన్ కౌంటర్లు
- 5 బ్యాగేజీ క్యారౌసెల్‌లు
- 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు
- 44 డిపార్చర్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు
తిరుచిరాపల్లికి చెందిన సాంస్కృతిక చైతన్యం నుంచి ప్రేరణ పొంది కొత్త టెర్మినల్ భవనాన్ని డిజైన్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రసిద్ధ శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన కళారూపాలను ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ గోపురాన్ని తీర్చిదిద్దారు. వీటితో పాటు భారత్‌కు ప్రపంచంతో ఉన్న సంబంధాలను వర్ణింపజేసేలా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ వర్క్‌ను చేపట్టారు.
"కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం మేము చాలా కష్టపడ్డాము. లోపల కుడ్యచిత్రాలను అమర్చాము. వీటిని అమర్చేందుకు మొత్తం 100 మంది కళాకారులు 30 రోజులు పనిచేశారు."
- రాజవిఘ్నేశ్, ఆర్ట్‌వర్క్స్ క్రియేటివ్ డైరెక్టర్
ప్రధాని తమిళనాడు పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ ఆయనకు ఘన స్వాగతం పలికింది. మోదీ సహా పార్టీ కీలక నేతలు ఉన్న బ్యానర్లను విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటించే ప్రాంతాల్లో భారీ స్థాయిలో భద్రతా సిబ్బందిని కూడా మోహరించారు తమిళనాడు పోలీసులు. ఇక తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం, బుధవారం లక్షద్వీప్, కేరళలో కూడా పర్యటించనున్నారు. తమిళనాడుకు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు.
-
PM Modi arrives at Tiruchirappalli to inaugurate multiple development projects worth more than Rs 19,850 crores
— ANI (@ANI) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
He was received by Tamil Nadu Governor RN Ravi, Chief Minister MK Stalin and MoS L Murugan pic.twitter.com/4NXEPnfdsi
">PM Modi arrives at Tiruchirappalli to inaugurate multiple development projects worth more than Rs 19,850 crores
— ANI (@ANI) January 2, 2024
He was received by Tamil Nadu Governor RN Ravi, Chief Minister MK Stalin and MoS L Murugan pic.twitter.com/4NXEPnfdsiPM Modi arrives at Tiruchirappalli to inaugurate multiple development projects worth more than Rs 19,850 crores
— ANI (@ANI) January 2, 2024
He was received by Tamil Nadu Governor RN Ravi, Chief Minister MK Stalin and MoS L Murugan pic.twitter.com/4NXEPnfdsi
-
Drone visuals of the New Terminal Building at Tiruchirappalli International Airport that will be inaugurated by PM Modi later today. pic.twitter.com/k9Cc1TGlos
— Press Trust of India (@PTI_News) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Drone visuals of the New Terminal Building at Tiruchirappalli International Airport that will be inaugurated by PM Modi later today. pic.twitter.com/k9Cc1TGlos
— Press Trust of India (@PTI_News) January 2, 2024Drone visuals of the New Terminal Building at Tiruchirappalli International Airport that will be inaugurated by PM Modi later today. pic.twitter.com/k9Cc1TGlos
— Press Trust of India (@PTI_News) January 2, 2024
అప్పుల కోసం ఇంట్లో గొడవ- భార్యాపిల్లలను చంపేసిన పోస్ట్‌మ్యాన్- ఆపై సూసైడ్!
బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలిక మృతి- ప్రమాదం నుంచి రక్షించినా దక్కని ప్రాణాలు