మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా.. దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మహాత్ముడికి నివాళులు అర్పించారు. మహాత్ముని ఆదర్శాలు.. లక్షలాది మందిలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయని మోదీ అంతుకుముందు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"మహాత్ముని ఆదర్శాలు.. లక్షలాది మందిలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి. భారతీయుల శ్రేయస్సు కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకునే రోజు ఇదని ఆయన పేర్కొన్నారు."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహాత్ముడికి నివాళులు అర్పించారు.

"జాతిపిత చెప్పిన అహింస, నిరాడంబరత, వినయ విధేయతలకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ సత్యం, ప్రేమ అనే సన్మార్గాలను అనుసరించాలి."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్‌ఘాట్‌కు చేరుకొని గాంధీకి నివాళులు అర్పించారు.

"అణగారిన వర్గాల అభ్యున్నతికి గాంధీ అవిశ్రాంత కృషి చేశారు. బాపు జీవితం, ఆయన అనుసరించిన సిద్ధాంతాలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయి."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

హజ్రత్‌గంజ్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్.. మహాత్ముడికి నివాళులు అర్పించారు. గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

ఇదీ చదవండి:మహాత్ముడి వర్ధంతి: సత్యాగ్రహ నినాదం- నిశ్శబ్ద పోరాటం