Lt Colonel Harjinder Singh: కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన 13 మందిలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల మధ్య జరిగాయి. సింగ్ చితికి ఆయన కుమార్తె ప్రీత్ కౌర్ నిప్పంటించారు. ఆమె వెంట సింగ్ భార్య మేజర్ ఆగ్నెస్ పి.మానెజెస్ (రిటైర్డ్ ఆర్మీ అధికారి) ఉన్నారు.
హర్జీందర్ సింగ్ పార్థివదేహానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సహా.. ఇతర సైనికాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ సింగ్‌కు పుష్పాంజలి ఘటించారు.
రచయితగానూ..
లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్ 1978 ఏప్రిల్ 17న జన్మించారు. దిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో సైనిక కోర్సు చేశారు. 11 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్.. సీడీఎస్ బిపిన్ రావత్ స్టాఫ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆయనకు సియాచిన్ గ్లేసియర్ వంటి హిమపాతాలపై పనిచేసిన అనుభవనం ఉంది. సైన్యంలో సేవలతో పాటు.. రచయితగా రాణించారు. ఇటీవలే "చైనా సెంటర్ స్పేస్ కెపబిలిటీస్" అనే పుస్తకాన్ని వెలువరించారు.
ఇదీ చదవండి: