ETV Bharat / bharat

'గిరిజనుల సంక్షేమం పట్టించుకోని గత పాలకులు' - మోదీ వార్తలు

దేశానికి గిరిజన సమాజం చేసిన సేవలు గత పాలకుల హయాంలో మరుగునపడిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) అన్నారు. దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో వారిదే కీలక పాత్ర అని కొనియాడారు. దేశ జనాభాలో 10 శాతంగా ఉన్నప్పటికీ.. గిరిజనుల (Janjatiya Gaurav Divas) సమస్యల గురించి గత పాలకులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

pm modi news
మోదీ వార్తలు
author img

By

Published : Nov 15, 2021, 3:24 PM IST

Updated : Nov 15, 2021, 4:33 PM IST

సమ్మేళన్​లో మోదీ

స్వాతంత్య్రం లభించిన తర్వాత తొలిసారి గిరిజనుల కళలు, సంస్కృతి, సంప్రదాయాలను దేశం సగర్వంగా స్మరించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి గిరిజనులు అందించిన సహకారాన్ని గుర్తిస్తున్నట్లు చెప్పారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశం జనజాతీయ గౌరవ్ దివస్ (Janjatiya Gaurav Divas) జరుపుకుంటోందని తెలిపారు. గోండు రాణి దుర్గావతి, రాణి కమల్​పతి, వీర్ మహారాణా ప్రతాప్ వంటి యోధుల సాహసాలను దేశం మర్చిపోదని అన్నారు.

modi bhopal news today
గిరిజనుల వస్తధారణలో మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో (PM Modi Bhopal visit) నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్​లో (Birsa Munda Jayanti) పాల్గొన్న మోదీ.. గిరిజనుల ఆటపాటల్లో జీవిత సందేశం ఉంటుందని కొనియాడారు. గత పాలకులు గిరిజనుల బాగోగులను పట్టించుకోలేదని కాంగ్రెస్​పై పరోక్షంగా విమర్శలు చేశారు. గతంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రస్తుతం కృషి జరుగుతోందని తెలిపారు.

modi bhopal news today
ప్రజలకు మోదీ, చౌహాన్ అభివాదం

"దేశాభివృద్ధికి గిరిజన సమాజం అందించిన సహకారం గురించి మాట్లాడితే చాలా మంది ఆశ్చర్యపోతారు. భారత దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో వారిదే కీలక పాత్ర అని చెబితే నమ్మరు. ఎందుకంటే వారి గురించి గతంలో ఎవరూ ఇలా చెప్పలేదు. వారి సేవలను గుప్తంగా ఉంచారు. లేదా పరిమిత సమాచారం ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారి వల్ల ఇలా జరిగింది. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కారణంగా గిరిజనులు, వారి సంస్కృతి సంప్రదాయాలు మరుగునపడ్డాయి. దేశ జనాభాలో 10 శాతంగా ఉన్నప్పటికీ.. గిరిజనుల సమస్యలు, విద్య, వైద్యం గురించి వారు(గత పాలకులు) పట్టించుకోలేదు. గతంలో వెనుకబడిన వంద జిల్లాల్లో ఇప్పుడు అభివృద్ధి జరుగుతోంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సమ్మేళంలో ప్రసంగించడానికి ముందు బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించారు మోదీ. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను ప్రారంభించారు. అంతకుముందు భోపాల్​లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​ను సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్​ పురందరే(99)కు నివాళులు అర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం పుణెలో కన్నుమూసిన పురందరే సేవలను గుర్తు చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ చరిత్రను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన పాత్ర చాలా గొప్పది అన్నారు. ప్రపంచానికి ఆయన పరిచయం చేసిన ఆదర్శభావాలు మనల్ని ముందుకు నడిపించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'జనజాతీయ గౌరవ్ దివస్​గా బిర్సా ముండా జయంతి'

Last Updated : Nov 15, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.