ETV Bharat / bharat

కొండపై చిక్కుకున్న యువకుడు.. హెలికాప్టర్​తో కాపాడిన ఎయిర్​ఫోర్స్​

TREKKER RESCUED: ట్రెక్కింగ్​కు వెళ్లి కొండపై పెద్ద లోయలో పడిపోయిన యువకుడిని భారత వాయుసేన కాపాడింది. ఈ సంఘటన కర్ణాటక, చిక్కబల్లాపూర్​లోని బ్రహ్మగిరి హిల్స్​ వద్ద జరిగింది.

Trekker rescued by  Air Force
కొండపై చిక్కుకున్న యువకుడు
author img

By

Published : Feb 20, 2022, 10:53 PM IST

యువకుడిని కాపాడిన వైమానిక దళం

TREKKER RESCUED: ట్రెక్కింగ్​కు వెళ్లి కొండపైన పెద్ద లోయలో చిక్కుకున్న యువకుడిని వైమానిక దళం హెలికాప్టర్​ సాయంతో కాపాడింది. ఈ సంఘటన కర్ణాటక, చిక్కబల్లాపూర్​ జిల్లాలోని నందగిరిధామ్​ సమీప బ్రహ్మగిరి హిల్స్​పై జరిగింది.

Trekker
చికిత్స పొందుతున్న నిశాంత్​

నందగిరిధామ్​లో వారాంతపు పర్యటనలను నిషేధించారు అధికారులు. ఈ క్రమంలోనే దిల్లీకి చెందిన నిశాంత్​ గుల్లా(19) అనే యువకుడు ఒంటరిగా బ్రహ్మగిరి హిల్స్​పైకి ట్రెక్కింగ్​కు వెళ్లాడు. కొండపైభాగంలోకి చేరుకోగానే జారిపడిపోయాడు. సుమారు 250 అడుగుల మేర కింద ఉన్న ఓ లోయలో పడిపోయాడు. భూమిపై నుంచి అది 350 అడుగుల ఎత్తు ఉంటుంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్​డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఎఫ్​, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, వారి చర్యలు ఫలించలేదు. దీంతో భారత వైమానిక దళం రంగంలోకి దిగి.. హెలికాప్టర్​ సాయంతో రక్షించింది. నిశాంత్​ బెంగళూరులోని పీఈఎస్​ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు.

ఇదీ చూడండి: కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా అన్నపానీయాలు లేక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.