ETV Bharat / bharat

మీకు సంతోషం కావాలా? - అక్కడ దొరుకుతుంది - వెళ్లి తెచ్చుకోవడమే! - best travelling tips and things

జీవితం సంతోషంగా సాగిపోవాలని ఎవరికి ఉండదు? ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే. కానీ.. మెజారిటీ జనానికి అది దొరకదు. ఎప్పుడూ నీరసంగా బతుకుబండిని నెట్టుకెళ్తూ ఉంటారు. మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా? అయితే.. మీకో అడ్రస్ చెప్తాం. అక్కడ సంతోషం దొరుకుతుంది. వెళ్లి తెచ్చుకోండి!

Best Travelling Tips
Travelling is The Best Option To Search Happiness
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 12:37 PM IST

Best Travelling Tips : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. మనుషులు ఆల్మోస్ట్ యంత్రాలుగా మారిపోయారు. ఏ కొద్ది మందినో మినహాయిస్తే.. మెజారిటీ జనం జీవితాన్ని ఆస్వాదించడం అన్నదే మరిచిపోయారు. రకరకాల సమస్యలు బుర్రలో చేరి తొలిచేస్తుంటే.. ఆ చిక్కు ముళ్లను సాల్వ్ చేసుకునే పనిలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని ఎవరో బయట పడేయలేరని.. మిమ్మల్ని మీరే ఒడ్డున పడేసుకోవాలని చెప్తున్నారు మానసిక నిపుణులు! ఇందుకోసం పాజిటివ్ మైండ్​ సెట్​ తో ఉండడతోపాటు.. ప్రతి ఒక్కరు తప్పకుండా టూర్లకు వెళ్లి రావాలని సూచిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి.. జీవితంలో సంతోషం పెంచుకోవడానికి ఇది చాలా అవసరమని అంటున్నారు. అంతేకాదు.. టూర్ ఎలా ప్లాన్ చేస్తే సక్సెస్‌ అవుతుందో కూడా తెలియజేస్తున్నారు.

బడ్జెట్‌ను అంచనా వేసుకోండి :
ట్రావెలింగ్‌ చేయడానికి ప్రపంచంలో అనేక మార్గాలున్నాయి. మీకు ఉన్న సమయాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్లాలో ముందుగానే నిర్ణయించుకోండి. అందుకోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించుకోండి. మీరు ఎన్ని రోజులు టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారో దానికి కావాల్సిన బడ్జెట్‌ ఎంతో సిద్ధం చేసుకోండి. దీనివల్ల మీకు ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వీలైతే మీరు అంచనా వేసుకున్న అమౌంట్‌ కంటే ఎక్కువగానే క్యారీ చేయాలి. ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది.

గ్యాడ్జెట్‌లకు దూరంగా :
మీరు ఎక్కడికైనా టూర్‌కు వెళ్లినట్లయితే.. ఫోన్‌, ల్యాప్ టాప్ వంటివి దూరం పెట్టండి. సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్న ప్రకృతి అందాలు, ప్రజల జీవన విధానం, వాతావరణ పరిస్థితులను గమనించండి. ఫ్యూచర్‌లో మళ్లీ మీరు ఆ ప్రదేశానికి వెళ్లకపోవచ్చు. కాబట్టి.. వీలైనంత వరకు ప్రకృతి అందాల్నీ మీ మనస్సులో పదిలంగా ఉండేలా చూసుకోండి.

ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోండి :
మన జీవితం కొనసాగినన్ని రోజులూ.. బాధ్యతలు, ఒత్తిడి, ఆందోళన వంటివి ఉంటూనే ఉంటాయి. అవి ఎక్కడికీ పోవు. కాబట్టి.. వాటికి కాస్త విరామం ఇవ్వండి. సంవత్సరానికి కనీసం ఒక రెండు టూర్‌లనైనా ప్లాన్‌ చేసుకోండి. దీనివల్ల ఆ మధురమైన క్షణాలు మనకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేస్తాయి. ఈ ట్రిప్‌లో మీరు ఎక్కడైతే స్టే చేయాలనుకుంటున్నారో అక్కడ ముందుగానే హోటల్స్‌, క్యాంపింగ్‌ సైట్‌లను బుక్‌ చేసుకోండి. దీనివల్ల మీకు టైమ్‌, మనీ రెండూ సేవ్‌ అవుతాయి.

టైమ్ ఇంపార్టెంట్ :
వీకెండ్స్, పండగ సమయాల్లో పర్యాటక ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీ ట్రిప్‌ ఆ సమయంలో ఉండాలనుకుంటే కాస్త ఆలోచించండి. ఇలాంటి సమయాల్లో మీరు అన్ని ప్రదేశాలనూ కవర్‌ చేయలేక పోవచ్చు. అలాగే.. ఈ పీక్‌ టైమ్‌లో హోటల్స్, ట్రావెల్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని కూడా గుర్తుంచుకోండి.

స్ట్రీట్‌ ఫుడ్‌ ట్రై చేయండి :
మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి స్ట్రీట్‌ ఫుడ్‌ను టేస్ట్‌ చేయండి. దీనివల్ల మీకు కొత్త రుచి తెలియడంతోపాటు, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు ఏంటో తెలుస్తాయి. కాబట్టి, ప్రతి టూర్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ని ఆస్వాదించడానికి ట్రై చేయండి.

చివరగా...

  • సంతోషం ఎక్కడో దొరకదు. అది మన మనసులోనే ఉంటుంది.
  • ముందుగా మీరు పాజిటివ్​గా ఉండడం అలవాటు చేసుకోండి. రేపు ఏం జరుగుతుందో అనే ఆందోళన పక్కన పెట్టండి.
  • ఒక పని పూర్తి కావడానికి మీరు నిజాయితీగా వంద శాతం ప్రయత్నం చేశారా లేదా? అనేదే ముఖ్యం. దీనిపై దృష్టిపెట్టండి. జయాపజయాలు కాలానికి వదిలేయండి.
  • ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతం కాదు. మార్పు అనివార్యం అని గుర్తించండి.
  • ఈ విషయాలను అంగీకరించి మీ పనిలో ముందుకు సాగండి.. విహార యాత్రలతో మనసును రిలాక్స్ చేస్తూ ఉండండి.

మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!

మీ పిల్లలు రోజూ బ్రష్ చేస్తున్నారు కరక్టే - ఇలా చేస్తున్నారా? - లేదంటే పుచ్చిపోవడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.