ETV Bharat / bharat

Trains To President Of India Murmu Own District : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలానికి తొలి రైలు.. ఎప్పటి నుంచో తెలుసా? - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టిన ప్రాంతానికి రైలు

Trains To President Of India Murmu Own District : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలం మయూర్​భంజ్ జిల్లాలోని రాయ్​రంగాపుర్ ప్రాంతానికి తొలి ప్యాసింజర్ రైలును మంజూరు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ ప్రాంత వాసులకు ఊరట లభించింది.

Trains To President Of India Murmu Own District

author img

By PTI

Published : Oct 19, 2023, 12:01 PM IST

Trains To President Of India Murmu Own District : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయ్​రంగాపుర్- బాదంపహార్ మార్గంలో తొలిసారిగా ప్యాసింజర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మయూర్​భంజ్ జిల్లాకు నూతనంగా మూడు రైళ్లను కేటాయిస్తూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంత వాసుల చిరకాల కోరిక తీరనుంది.

New Trains For Odisha : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జన్మస్థలం ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా రాయ్​రంగాపుర్ ప్రాంతం. ఈ ప్రాంతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. గిరిజన తెగలు ఎక్కువగా నివసించే రాయ్​రంగాపుర్​ ప్రాంత వాసులు చాలా కాలంగా ప్యాసింజర్ రైలు సేవలు కోసం ఎదురు చూస్తున్నారు. వారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మయూర్​భంజ్​ జిల్లాకు మూడు రైళ్లను కేటాయిస్తు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కోల్​కతా(షాలిమర్)- బాదంపహార్ వీక్లీ ఎక్స్​ప్రెస్, బాదంపహార్-రుర్కెలా-టాటానగర్ ఎక్స్​ప్రెస్, రుర్కెలా-టాటానగర్ ఎక్స్​ప్రెస్​( వారంలో ఆరు రోజులు) ఈ రైళ్లు తిరగనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

"టాటానగర్​ నుంచి-బాదంపహార్ మార్గంలో మెయిల్/ఎక్స్​ప్రెస్ సేవలు అందుబాటులో రానుండటం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలం మయూర్​భంజ్ జిల్లాలోని రాయ్​రంగాపుర్ ప్రాంతంతో పాటు బాదంపహార్​ ప్రాంతవాసులకు రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్రాంతంలో చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న ఇక్కడి ప్రజల డిమాండ్​ను పరిష్కరించాం. దీని ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. గిరిజన తెగలకు చెందిన ఈ ప్రాంతం మరింత ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుంది. త్వరలోనే రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తాం."
- అశ్వినీ వైష్ణవ్, రైల్వే శాఖ మంత్రి

నూతన రైళ్ల సమయాలివే
షాలిమార్ వీక్లీ ఎక్స్​ప్రెస్ ప్రతి శనివారం రాత్రి 11-05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5-40 గంటలకు బాదంపహార్ చేరుకుంటుంది. తిరిగి బాదంపహార్​లో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

Trains Cancelled From Secunderabad : కోరమండల్​ ఎఫెక్ట్​.. ఒడిశా వైపు వెళ్లే రైళ్లు రద్దు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.