ETV Bharat / bharat

రాజధాని ఎక్స్​ప్రెస్​కు తప్పిన పెను ప్రమాదం.. లోకోపైలట్​ సడెన్​ బ్రేక్​తో వేలాది మంది సేఫ్​!

ఝార్ఖండ్​లో రాజధాని ఎక్స్​ప్రెస్​కు పెను ప్రమాదం తప్పింది. ఓ ట్రాక్టర్​ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా.. రైలు వచ్చింది. ఇది గమనించిన లోకోపైలట్​ వెంటనే సడెన్​ బ్రేక్​ వేసి రైలును ఆపి.. వేల మంది ప్రాణాలు కాపాడారు.

train-accident-in-jharkhand-rajdhani-express-collided-tractor

author img

By

Published : Jun 7, 2023, 10:10 AM IST

Updated : Jun 7, 2023, 11:43 AM IST

Train Accident in Jharkhand Today : ఝార్ఖండ్​లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్​ గేట్​ను దాటుతున్న ఓ ట్రాక్టర్​ను.. అదే సమయంలో వచ్చిన రాజధాని ఎక్స్​ప్రెస్​ నెమ్మదిగా ఢీ కొట్టింది. దూరం నుంచే ట్రాక్టర్​ను గమనించిన లోకో పైలట్​..​ వెంటనే అప్రమత్తమై ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులను గట్టెక్కించారు. సడెన్ ​బ్రేకులు వేసి వేలమంది ప్రాణాలను కాపాడారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

బొకారో జిల్లాలోని భోజుడి స్టేషన్ సమీపంలో ఉన్న సంతాల్​దియా రైల్వే క్రాసింగ్​ వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వారు వివరించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. 5.27 గంటలకు పట్టాలపై నుంచి ట్రాక్టర్​ను తొలగించినట్లు వెల్లడించారు.

ఘటన అనంతరం ట్రాక్టర్​ డ్రైవర్​ పారిపోయాడని అధికారులు తెలిపారు. రైల్వేగేట్​ను ఆలస్యంగా క్లోజ్ చేయడమే.. ప్రమాదానికి కారణమని వారు వెల్లడించారు. దీంతో గేట్​మన్​ను విధుల నుంచి సస్పెండ్​ చేసినట్లు పేర్కొన్నారు. ఘటనలో ఎవరికీ హాని జరగలేదన్న అధికారులు.. 45 నిమిషాల పాటు రైలు నిలిచిపోయిందని తెలిపారు.

train accident in Jharkhand rajdhani express Collided Tractor
రాజధాని ఎక్స్​ప్రెస్ ప్రమాదం

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు..
మధ్యప్రదేశ్‌లోనూ ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జబల్‌పూర్ పరిధిలోని షహపూర్‌ భితౌనీ వద్ద LPG తీసుకుని వెళ్తున్న రైలు.. ఈ ప్రమాదానికి గురైంది. గూడ్సు రైలుకు చెందిన రెండు వ్యాగన్లు.. పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దిగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన గూడ్సు రైలు పట్టాలు తప్పిందని చెప్పిన పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్​ఓ.. ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. పట్టాలు తప్పిన మార్గాన్ని సరిచేసేపనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

Madhya Pradesh derailed goods train
మధ్యప్రదేశ్ పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

Train Accident Odisha : జూన్ 2న ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం.. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఆ ఘటన మరవక ముందే అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. దీంతో రైల్వే ప్రయాణికులు కాస్త ఆందోళలకు గురవుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒడిశాలోని బహానగా రైల్వే స్టేషన్​లో లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలను ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 288 మంది మృతి చెందారు. మరో 1,200 మందికిపైగా గాయపడ్డారు.

Last Updated : Jun 7, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.