Traffic Jam at Hyderabad Vijayawada Highway Today : సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో (Sankranti Rush in Telangana) కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆరు వరుసల రహదారి విస్తరణ పనులతో ఈ పరిస్థితి నెలకొంది.
Sankranti Rush At Panthangi Toll Plaza 2024 : రద్దీని (Sankranti Rush) దృష్టిలో పెట్టుకొని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు 10 గేట్లను తెరిచి ఉంచారు. అదేవిధంగా కొర్లపహాడ్ టోల్‌గేట్ వద్ద మొత్తం 14 టోల్ చెల్లింపు కేంద్రాలకు గాను 8 గేట్లను, గూడూరు టోల్ ప్లాజా వద్ద వరంగల్ వైపు వెళ్లే దారిలో ఆరు టోల్ చెల్లింపు కేంద్రాలను తెరిచారు. జాతీయ రహదారిపై బాటసింగారం, అబ్దుల్లాపూర్‌మెట్, కొత్తగూడెం, చౌటుప్పల్ లాంటి ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు జరగుతున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి తోడు ఉదయం పొగమంచు తోడైంది. ముందు వాహనాలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు చాలా నిదానంగా డ్రైవ్ చేస్తున్నారు.
ఊరెళ్తున్న భాగ్యనగరం - ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు
Sankranti Festival Effect 2024 : పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా, చకా చకా ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. గతంలో టోల్ వసూలులో ఫాస్టాగ్ విధానం అమలులోకి రాక ముందు కొన్ని గంటల పాటు వేచి చూసే వారు. కానీ ప్రస్తుతం ఫాస్టాగ్ విధానంతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించింది. నిన్న ఒక్కరోజే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 60,000లకు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్లు సమాచారం. గంటకు 2500 నుంచి 3000 మధ్యలో వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణించినట్లు తెలుస్తోంది.
మొదలైన సంక్రాంతి సందడి - కీసర టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
Sankranti Rush in Telangana 2024 : మరోవైపు సంక్రాంతి పండుగకు (Sankranti Festival 2024)సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 120కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. వీటితో పాటు సాధారణ రైళ్లు సుమారు 400 వరకు నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. ఈ నెల 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు.
Sankranti Rush: జంటనగరాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ప్రాంగణాలు
సంక్రాంతికి ఊరికెళ్లేదెలా?.. కిక్కిరిసిపోతున్న రైల్వే, బస్ స్టేషన్లు