ETV Bharat / bharat

కమల్​హాసన్​కు ఎదురుదెబ్బ- పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా

author img

By

Published : May 6, 2021, 10:03 PM IST

సినీనటుడు, మక్కల్​ నీది మయ్యం పార్టీ అధినేత కమల్​ హాసన్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్​ మహేంద్రన్​ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు.

MNM
కమల్​ హాసన్​

కమల్​ హాసన్​ పార్టీ మక్కల్​ నీది మయ్యం​లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్​ మహేంద్రన్​ ఆరోపించారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

"మక్కల్​ నీది మయ్యం లో ప్రజాస్వామ్యం లేదు. అయితే ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి మార్చాలని అనుకున్నాను. తీరా చూస్తే అది జరిగేలా లేదు. పార్టీ నిర్వహణలో కమల్​ హాసన్​ విఫలమయ్యారు."

-ఆర్​ మహేంద్రన్​, మక్కల్​ నీది మయ్యమ్​ ఉపాధ్యక్షుడు

ఏప్రిల్​ 6న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్​లోని సింగనల్లూర్​ నుంచి మహేంద్రన్​ పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలోని ఏడుగురు సీనియర్​ నాయకులు ఎంఎన్​ఎం​కు రాజీనామా చేశారు.

కమల్​హాసన్​ కూడా ఎన్నికల్లో ఓడిపోవడం గమనార్హం. ఆ పార్టీకి ఒక్క సీటూ రాలేదు.

ఇదీ చదవండి: 72 శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.