ETV Bharat / bharat

టూల్​కిట్​ కేసులో దిశ రవికి బెయిల్ - రైతుల ఆందోళన

టూల్​కిట్​ కేసులో అరెస్టైన పర్యావరణ కార్యకర్త దిశ రవికి దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు.. ఈ కేసు సహనిందితుడు శంతను ములుక్ ముందస్తు బెయిల్​ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు.

'Toolkit' case: Disha Ravi reaches Delhi Police Cyber Cell office
టూల్​కిట్​ కేసు: దిశ రవి విచారణ- బెయిల్​ కోసం శంతను
author img

By

Published : Feb 23, 2021, 3:29 PM IST

Updated : Feb 23, 2021, 7:31 PM IST

అన్నదాతల ఆందోళనకు సంబంధించిన టూల్​కిట్​ వ్యవహారంలో అరెస్టయిన దిశ రవికి ఊరట లభించింది. దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.​ ఇద్దరి పూచీకత్తుతో, రూ. లక్షకు సమానమైన బాండ్​ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

అంతకుముందు.. దిశా రవికి ఖలిస్థానీ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో.. ఖలిస్థానీ అనుకూల కార్యకర్తలకు, దిశకు సంబంధాలున్నట్లు తేలలేదని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 26న జరిగిన హింసకు పాల్పడిన వారితో ఖలిస్థానీ పీజేఎఫ్​ లేదా దిశకు సంబంధాలున్నట్లు ఒక్క సాక్ష్యాధారమూ లేదని పేర్కొంది. ఆమెకు బెయిల్​ వద్దని చెప్పేందుకు ఏ కారణమూ లేదని అడిషనల్​ సెషన్స్​ జడ్జి ధర్మేందర్​ రాణా తెలిపారు.

మరోవైపు, దిశకు బెయిల్‌ మంజూరు చేయడాన్ని దిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఆమె బెయిల్‌పై విడుదలైతే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు.

రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బర్గ్​ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఈ టూల్​కిట్​ డాక్యుమెంట్​ కేసులో బెంగళూరుకు చెందిన దిశ రవిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.

దిల్లీ పోలీసుల విచారణ..

దిశను మంగళవారం ఉదయం దిల్లీ పోలీసులు ప్రశ్నించారు. సహనిందితులు నికత జాకబ్​, శంతను ములుక్​తో కలిపి వేర్వేరు కోణాల్లో విచారించారు. ఇప్పటికే జాకబ్​, ములుక్​.. సోమవారం విచారణ ఎదుర్కొన్నారు.

మరోవైపు.. పర్యావరణ కార్యకర్త శంతను ముందస్తు బెయిల్​ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. అడిషనల్​ సెషన్స్​ జడ్జి ధర్మేందర్​ రాణా ముందుకు.. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశముంది. ములుక్​ బాంబే హైకోర్టు నుంచి.. ఫిబ్రవరి 16న ట్రాన్సిట్​ బెయిల్​ పొందారు. దీనికి 10 రోజుల గడువు ఉంది.

Shantanu
శంతను ములుక్​

ఇదీ చూడండి: దిశ బెయిల్ పిటిషన్​పై తీర్పు వాయిదా

Last Updated : Feb 23, 2021, 7:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.