రైతు నిరసనలకు సంబంధించిన టూల్‌కిట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంతను ములుక్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శంతను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై స్పందించేందుకు దిల్లీ పోలీసులు సమయం కోరిన నేపథ్యంలో ఆయనకు మార్చి 9 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అప్పటివరకు శంతనుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించారు అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేందర్ రాణా.
టూల్‌కిట్ కేసులో దిశా రవి, నికితా జాకబ్‌లతో పాటు శంతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టూల్‌కిట్‌ను నిషేధిత ఖలిస్థానీ సంస్థతో పంచుకున్నారని పోలీసులు అభియోగాలు మోపారు.
ఇవీ చదవండి: