Tomato Stolen In Karnataka : కర్ణాటకలో ఓ మహిళా రైతు పొలంలో 2.5 లక్షలు విలువైన టమాటా పంట చోరీకి గురైంది. 50 నుంచి 60 బస్తాల టమాటాలతో దొంగలు పరారయ్యారు. టమాటాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల.. పంట కోసి బెంగళూరుకు తరలిద్దామనుకున్న క్రమంలో చోరీ జరిగిందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జరిగింది ఈ ఘటనపై.. హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆశలు ఆవిరి..
ధరణి అనే మహిళ కర్ణాటకలోని హసన్ జిల్లా సోమనహళ్లి గ్రామానికి చెందిన వారు. ఆమె టమాటా రైతు. ఈ సంవత్సరం ధరణి.. తమ కుటుంబ సభ్యులతో కలిసి రెండకరాలలో టమాటా పంట సాగు చేశారు. ఈసారి పంట దిగుబడి బాగా వచ్చిందని, మార్కెట్లో కూడా టమాటాలకు డిమాండ్ ఉండడం వల్ల మంచి లాభాలు వస్తాయని వారు ఆశించారు. బెంగళూరు మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 120 పలుకుతున్న క్రమంలో.. పంట కోసి మార్కెట్కు పంపుదామని అనుకునేలోపు ఇలా జరిగింది. దీంతో మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
-
Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.
— ANI (@ANI) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr
">Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.
— ANI (@ANI) July 6, 2023
A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTrKarnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.
— ANI (@ANI) July 6, 2023
A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr
" మాకు గతంలో చిక్కుడు పంటలో నష్టం వచ్చింది. దీంతో అప్పులు చేసి మరీ టమాటా సాగు చేశాము. ఈసారి పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. దానికి తోడు మార్కెట్లో టమాటా మంచి ధర పలుకుతోంది. ఇలాంటి సమయంలో దొంగలు పంటను దోచుకున్నారు. సుమారు 50 - 60 బస్తాల టమామాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన పంటను కూడా ధ్వంసం చేశారు"
- ధరణి, మహిళా రైతు
టమామా పంట దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు రావడం ఇదే మొదటిసారి అని హళేబీడు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపైన సరైన దర్యాప్తు జరిపించి.. పంటకు నష్టపరిహారం చెల్లించాలని ధరణి కుమారుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాగా గత కొద్ది రోజులుగా కర్ణాటకలో టమాటాల రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు మార్కెట్లో కిలో టమాటా వంద రూపాయలు దాటేసింది. మార్చ్, ఏప్రిల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంట దిగుబడి తగ్గిపోయింది. ఈ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగి వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
దొంగల భయంతో సీసీ కెమెరా ఏర్పాటు..
దేశంలో అనేక నగరాల్లో టమాటాల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఓ కూరగాయల వ్యాపారి మార్కెట్ ఆవరణలో బుట్టలో కెమెరా ఉంచి టమాటాలు విక్రయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వింత సంఘటన కర్ణాటక హవేరిలో జరిగింది. ఈ వీడియో చూడాలంటే కింది లింక్ పైన క్లిక్ చేయండి..