ETV Bharat / bharat

మార్కెట్​లో భగ్గుమంటున్న టమాటా ధర.. కిలో రూ.300 పైనే! - tomato price in delhi

Tomato Price Today : భారీ వర్షాల కారణంగా క్రమంగా పెరుగుతున్న టమాటా ధర తాజాగా చండీగఢ్ మార్కెట్​లో కిలో రూ. 200 - 250 కు చేరింది. రిటైల్​లో అయితే రూ. 300 - 400 దాకా పలుకుతోంది. ఈ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

Tomato Price Hike
భగ్గుమంటున్న టమాటా ధర
author img

By

Published : Jul 15, 2023, 1:06 PM IST

Tomato Price Today : చండీగఢ్ మార్కెట్​లో టమాటా ధర తారా స్థాయికి చేరుకుంది. కిలో టమాటా ధర రూ. 200 నుంచి 250 వరకు పలుకుతోంది. అదే రిటైల్ దుకాణాల్లో​ అయితే టమాటా ధర మరింత భగ్గుమంటోంది. ఏకంగా రూ. 300 నుంచి 400 లకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత గల టమాటా అదే మార్కెట్​లో రూ. 100 - 150గా ఉంది. ఈ ధరలు చూసిన స్థానికులు.. లీటర్ పెట్రోల్ కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా ధరలు పెరుగుతున్న క్రమంలో టమాటా నిల్వ ఉంచుకున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Tomatop Price Chandigarh : అయితే భారీ వర్షాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు. కాగా చండీగఢ్​కు ప్రధానంగా పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్​ రాష్ట్రాల నుంచే కూరగాయలు వస్తుంటాయి. ముఖ్యంగా టమాటా, ఉల్లి నాశిక్ నుంచి వస్తాయి. కానీ నిరంతర వర్షాల వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి.. రవాణా నిలిచిపోయింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో వర్షాల కారణంగా కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం హరియాణా నుంచి కాకరకాయ, ఓక్రా, పచ్చిమిర్చి మాత్రమే వస్తున్నాయి. ఇక టమాటా సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చండీగఢ్ మార్కెట్​కు సోలన్​ జిల్లా నుంచే టమాటా సరఫరా అవుతున్నాయని విక్రయదారులు పేర్కొన్నారు.

"ప్రస్తుతం సోలన్ నుంచి మాత్రమే టమాటాలు వస్తున్నాయి. దీంతో టమాటా కొరత తీవ్రంగా ఏర్పడింది. ఒక టమాటా పెట్టెను రూ. 6-7వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. అందులో 10 - 15 శాతం టమాటాలు పాడవుతున్నాయి. మార్కెట్​లోకి ఒకే ప్రాంతం నుంచి టమాటాలు రావడం వల్ల డిమాండ్ మరింత పెరిగింది. సోలన్​లో పొలాల వద్దే భూస్వాములు టమాటాలు కొనుగోలు చేసి.. వ్యాపారులకు వేలం ద్వారా విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్​లో కిలో టమాటా ధర. 250-300 ఉండగా.. బయట రిటైల్ దుకాణాల్లో రూ. 400 దాకా పలుకుతోంది"

- ముకేశ్, చండీగఢ్ మార్కెట్​లో కూరగాయల వ్యాపారి

Tomato Rate : గత నెలలో కిలో టమాటా రూ. 40 ఉండేదని.. ప్రస్తుతం కిలో రూ. 300కు చేరిందని మార్కెట్​కు వచ్చిన సామాన్యుడు వాపోయాడు. మార్కెట్ మొత్తం తిరగగా.. ఒక చోట రూ. 150 కిలో టమాటా లభించినట్టు ఆయన తెలిపారు. టమాటానే కాకుండా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.