Tomato Farmer Millionaire : వారం క్రితం వరకు దేశంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని ప్రదేశాల్లో కేజీ టమాటా ధర రూ.200 వరకు పలికింది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఎకరం భూమిలో టమాటా సాగు చేసి.. రూ.15 లక్షలు సంపాదించాడు. ఈ రైతు విజయగాథ ఏంటో తెలుసుకుందాం మరి.
Maharashtra Farmer Tomato Millionaire : పుణె జిల్లాలోని ఖేడ్ తాలుకాలోని మంజ్రేవాడికి చెందిన అరవింద్ మంజరే తన భార్యతో కలిసి టమాటా సాగు చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ఎకరం పొలంలో టమాటా నారును వేశాడు. టమాటా సాగుకు అరవింద్‌కు దాదాపు రూ.లక్షన్నర ఖర్చు అయ్యింది. కానీ అరవింద్ టమాటా నారు వేసేటప్పటికి మార్కెట్లో అంతగా ధర లేదు. కానీ ఇటీవల కాలంలో ధర పెరగడం వల్ల అరవింద్ జాక్‌పాట్ కొట్టాడు. ఎకరంలో పండిన టమాటా పంటను రూ.15 లక్షలకు విక్రయించాడు.
"కొన్ని నెలల క్రితం సరైన ధర లభించక టమాటాలను రోడ్డున పడేసే పరిస్థితి వచ్చింది. కేజీ టమాటా ధర రూ.2 నుంచి రూ.3 మాత్రమే పలికేది. అయితే గత రెండు నెలలుగా టమాటా ధర పెరగడం వల్ల భారీ లాభాలను పొందాం. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. నా భార్య నాకు ఎల్లవేళలా అండగా నిలిచింది. అకాల వర్షాలు, సరైన ధరలు లేక అంతకుముందు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు."
-- అరవింద్ మంజరే, రైతు
ధరలు తక్కువగా ఒక టమాటా బాక్స్ ధర రూ. 250 మాత్రమే పలికేదని అన్నాడు అరవింద్. గత రెండు నెలలుగా టమాటా రేటు భారీగా పెరగడం వల్ల టమాటా బాక్స్ రూ.రెండు వేలకు చేరిందని చెప్పాడు.
టమాటాతో రూ. కోట్లలో ఆదాయం..
Tomato Farmer Crorepati : ఇటీవలే హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లా బాల్హ్ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్ సైనీ సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కాసుల వర్షం కురిపించింది. దాదాపు 8,300 బాక్సులు అమ్మడం ద్వారా రూ.1.10 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 50 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా.. ఈ ఏడాది మాత్రమే ఆయన పంట పండింది. గతేడాది ఇదే సమయంలో 10 వేల టమాటా బాక్సులు విక్రయించానని.. దీనికి గాను రూ. 55 లక్షలు మాత్రమే వచ్చినట్లు సైనీ తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
టమాటాల వ్యాన్ హైజాక్.. 2500 కిలోల సరకుతో పరార్
Chittoor Tomato Farmer Millionaire: సిరులు కురిపిస్తున్న టమాటా.. నెలలో కోటీశ్వరుడైన చిత్తూరు రైతు