ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​తో 'టాలీవుడ్'లో చీలిక! - 2009 Lok Sabha

బంగాల్​లో తొలిసారి అధికారంలోకి రావాలని ఈసారి గట్టి ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. మరోవైపు.. హ్యాట్రిక్​ కొట్టాలని ఊవిళ్లూరుతోంది అధికార తృణమూల్​ కాంగ్రెస్​. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయం.. ఇప్పుడు బంగాల్​ సినీ పరిశ్రమ(టాలీవుడ్​) చుట్టూ తిరుగుతోంది. సినీ నటుల చేరికలు, ఫిరాయింపులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో టాలీవుడ్​కు రాజకీయ రంగు పులుముకుంది. ఇన్నాళ్లుగా తృణమూల్​ నియంత్రణలో ఉన్న బంగాల్​ చిత్ర పరిశ్రమ.. భాజపా ఎంట్రీతో చీలిపోయినట్లు కనిపిస్తోంది.

Tollywood divided ahead of Bengal polls
బంగాల్​ ఎన్నికలకు ముందు గేరు మార్చిన 'టాలీవుడ్'​!
author img

By

Published : Mar 9, 2021, 5:27 PM IST

అసెంబ్లీ ఎన్నికల ముందు.. బంగాల్​ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు సినీ గ్లామర్‌ను దట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ప్రధాన పార్టీలు కండువాలు కప్పగా.. ఇటీవల భాజపా కాస్త ముందడుగు వేసింది. బాలీవుడ్​లో, బంగాల్​ సినీ పరిశ్రమలో మెగాస్టార్​గా వెలుగొందుతున్న ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని చేర్చుకొని బలం పెంచుకుంది. ఇలా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో.. బంగాల్​ చిత్ర పరిశ్రమ (టాలీవుడ్​) కీలకంగా మారింది.

MITHUN
మోదీతో్ మిథున్​ చక్రవర్తి

ఇదీ చూడండి: మిథున్‌ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!

2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్​.. టాలీవుడ్​పై పూర్తి నియంత్రణ సాధించింది. అయితే.. ఇటీవల భాజపా ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. టాలీవుడ్​ నుంచి విశేష మద్దతు ఉన్న టీఎంసీని గద్దె దింపాలన్న లక్ష్యంతో.. పలువురు సెలబ్రిటీలను ఎన్నికల బరిలోకి దింపుతోంది భాజపా. మమత వ్యూహాన్ని దెబ్బకొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

BABUL
బాబుల్​ సుప్రియో

టాలీవుడ్ ప్రముఖులకు భాజపా ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి మరో కారణముంది. విశేష ప్రజాదరణ కలిగిన సినీ తారలను తమ వైపునకు తిప్పుకుంటే... ఔట్​సైడర్​(బయటి వ్యక్తి) అన్న ముద్రను పోగొట్టుకుని, బంగాలీల మనసులో స్థానం సంపాదించుకోవచ్చన్నది ఆ పార్టీ ఆలోచన.

అధికార పార్టీకి ఆప్తులే..

తృణమూల్​ కాంగ్రెస్​కు ఎప్పటినుంచో సినీ రంగంతో మంచి అనుబంధం ఉంది. బంగాలీ సినీ తారలు నుస్రత్​ జహాన్​, మిమి చక్రవర్తి(లోక్​సభ ఎంపీ) సహా పలువురు నటులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న టీఎంసీ మరికొంతమంది సినీ నటుల్ని పార్టీవైపు ఆకర్షిస్తోంది.

NUSRAT
టీఎంసీ ఎంపీ, సినీ నటి నుస్రత్​ జహాన్​
MIMI
టీఎంసీ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తి

సినీనటులు ఓట్ల వర్షం కురిపించకపోయినా... ఓటర్లను ప్రభావితం చేయగలరని, ముఖ్యంగా గ్రామీణ, సెమీ- అర్బన్​ ప్రాంతాల్లో ఈ మంత్రం పనిచేస్తుందని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి.

''మా పార్టీలో అన్ని వర్గాల ప్రజలు ఉండాలని మేం కోరుకుంటున్నాం. సినీ పరిశ్రమకు చెందినవారికి విశేష అభిమానగణం ఉంటుంది. టాలీవుడ్​లో టీఎంసీ ప్రభుత్వం అరాచకం సృష్టించింది. రాష్ట్ర ప్రజలు, నటులు.. దీని నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారు.''

- దిలీప్​ ఘోష్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అయితే.. భాజపా ఆరోపణల్ని తృణమూల్​ తిప్పికొట్టింది. 'బంగాలీ సంస్కృతిని అనుసరించేవారు ఎవ్వరూ.. బయటిపార్టీ అయిన భాజపాలో చేరరు' అని రాష్ట్ర మంత్రి అరూప్​ బిశ్వాస్​ అంటున్నారు.

''భాజపా, బంగాలీ సంస్కృతి.. సిద్ధాంతాలు పరస్పర విరుద్ధం. ఈ రెండూ కలిసుండే ప్రసక్తే లేదు. భాజపాలో చేరినవారు.. త్వరలోనే వాస్తవాన్ని గ్రహించి తమ నిర్ణయం పట్ల చింతిస్తారు.''

- అరూప్​ బిశ్వాస్​, టీఎంసీ సీనియర్​ నేత, రాష్ట్ర మంత్రి

టాలీవుడ్.. అరూప్​ బిశ్వాస్​, ఆయన సోదరుడు స్వరూప్ గుప్పిట్లోనే ఉందని, వారి బెదిరింపులను తట్టుకోలేకే తమ పార్టీలో చేరుతున్నారని భాజపా మహిళా మోర్చా నాయకురాలు, సినీ నిర్మాత సంఘమిత్రా చౌదరి ఆరోపిస్తున్నారు.

దీనికి బదులిచ్చిన బిశ్వాస్​.. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతో చేసిందని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

''సుదీర్ఘంగా ఐక్యంగా ఉన్న సినీ పరిశ్రమను విడగొట్టాలని భాజపా ప్రయత్నిస్తోంది.''

తృణమూల్​లో అధికారాన్ని అనుభవించి.. ఇప్పుడు భాజపాలో చేరుతున్న వారిని అవకాశవాదులుగా అభివర్ణించారు టీఎంసీ అభ్యర్థి, సినీ నటుడు సోహమ్​ చక్రవర్తి.

KAUSHANI
కౌషని ముఖర్జీ

ఎప్పటి నుంచో అనుబంధం..

బంగాల్ రాజకీయ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. టాలీవుడ్​తో ఎలాంటి అనుబంధం ఉందో తెలుస్తుంది. దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వస్తున్నారు.

1930ల్లో మూకీ కాలంలో బంగాల్​ చిత్ర పరిశ్రమ.. కాంగ్రెస్​కు అనుకూలంగా ఉండేది. ఎందరో నటులు.. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్నారు. టాలీవుడ్​ ఎవర్​గ్రీన్​ నటుడు ఉత్తమ్​ కుమార్​ కూడా కాంగ్రెస్​కు విధేయుడే.

దిగ్గజ దర్శకులు రిత్విక్​ ఘటక్​, మృణాల్​ సేన్​, సత్యజిత్​ రే.. నటులు ఉత్పల్​ దత్తా, సౌమిత్ర ఛటర్జీ​ వచ్చాక టాలీవుడ్​ వామపక్షాల వైపు మళ్లింది.

SOUMITRA
సౌమిత్ర ఛటర్జీ

సినిమాతోనే సందేశం..

మావోయిస్టులు ప్రభావం చూపిన 1960-70ల మధ్య కాలంలో.. అప్పటి సామాజిక- రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా ఎన్నో సినిమాలు రూపొందాయి. అప్పటి నుంచే రాజకీయ సందేశాలను చేరవేయడంలో సినిమా ఓ ప్రధాన సాధనంగా మారింది. వామపక్ష సాంస్కృతిక సంస్థ- ఇండియన్​ పీపుల్స్​ థియేటర్​ అసోసియేషన్​లో.. రే, ఛటర్జీ, సేన్​, దత్ సభ్యులు కూడా.

1977 నుంచి 34 ఏళ్ల సుదీర్ఘ పాలనలో ఈ సినీ ప్రముఖులే కాకుండా.. రాజకీయ మేధావులూ వామపక్షాల వెన్నంటే ఉన్నారు. వీరందరికీ వారధిగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్​ భట్టాచార్య.

నందిగ్రామ్​తో మార్పు..

2006-07 మధ్య కాలంలో.. సింగూర్​, నందిగ్రామ్​లో జరిగిన భూ వ్యతిరేక ఉద్యమంతో మార్పు మొదలైంది. వామపక్షాల విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. బహిరంగంగానే విమర్శించారు. అదే సమయంలో.. తృణమూల్​ కాంగ్రెస్​ 2009 లోక్​సభ, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటీలను బరిలోకి దింపి విజయం సాధించింది.

2010-11లో టాలీవుడ్​, రాష్ట్ర మేధావుల వర్గం విడిపోయాయి. అధికారంలోకి వచ్చిన అనంతరం.. తృణమూల్ కాంగ్రెస్​ టాలీవుడ్​పై పూర్తి నియంత్రణ సాధించింది.

మళ్లీ భాజపా..

దాదాపు మళ్లీ దశాబ్దం తర్వాత.. రాజకీయ కోణంలో సినీ పరిశ్రమ చీలిపోయింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో భాజపా మంచి ప్రదర్శన కనబర్చింది. ఈ నేపథ్యంలోనే.. మరికొంత మంది నటులు కమల దళంలో చేరారు.

బంగాల్​ నటులు బాబుల్​ సుప్రియో, రూపా గంగూలీ, లాకెట్​ ఛటర్జీ.. భాజపాలో ఎప్పటినుంచో ఉన్నారు. 2019 ఎన్నికల అనంతరం.. మరికొందరు సెలబ్రిటీలు రిమ్​జిమ్​ మిత్రా, అంజనా బసు, కాంచనా మొయిత్రా కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.

ఎన్నో బంగాలీ సినిమాల్లో నటించిన రుద్రనీల్​ ఘోష్ నెలక్రితం భాజపాలో చేరారు. కొద్దిరోజులకు.. యశ్​ దాస్​గుప్తా, పాయల్​ సర్కార్​, హిరెన్​ ఛటర్జీ, పపియా అధికారి, స్రవంతి ఛటర్జీ వంటి నటులు కూడా.. ఆయనను అనుసరించారు.

Srabanti Chatterjee
స్రవంతి ఛటర్జీ
Paayel Sarkar
పాయల్​ సర్కార్​

మార్చి 7న కోల్​కతాలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ వేదికగా పార్టీలో చేరారు బాలీవుడ్​, టాలీవుడ్​ దిగ్గజ నటుడు మిథున్​ చక్రవర్తి. ఆయనను బంగాలీ బిడ్డగా పిలిచారు మోదీ. రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి మిథునేనని ప్రచారం కూడా సాగుతోంది.

తృణమూల్​లోనూ..

టీఎంసీలోనూ సినీ రంగ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. ఇటీవలే దాదాపు మరో 10 మందిని పార్టీలోకి చేర్చుకున్న తృణమూల్​.. నటులు సయోనీ ఘోష్​, కౌషని ముఖర్జీ, దర్శకుడు రాజ్​ చక్రవర్తికి టికెట్​ కూడా ఇచ్చింది.

SAYONI GHOSH
మమతా బెనర్జీతో సయోనీ ఘోష్
NUSRAT JAHAN
నుస్రత్​ జహాన్​

వామపక్షాల్లో..

ఈ రెండింట్లోనే కాకుండా.. లెఫ్ట్​ వర్గంలోనూ సెలబ్రిటీలు ఉన్నారు. కమలేశ్వర్​ ముఖర్జీ, సవ్యసాచి చక్రవర్తి, తరుణ్​ మజుందార్​, అనిక్​ దత్తా, శ్రీలేఖ మిత్రా, బాద్​షా మొయిత్రా.. వామపక్ష పార్టీల్లో ఉన్నారు.

SRILEKHA
శ్రీలేఖ మిత్రా

అయితే.. సులువుగా విజయవంతం అవ్వాలన్న ఆలోచనతోనే సినీ రంగ ప్రముఖులు రాజకీయాల్లో చేరుతున్నారని అంటున్నారు ప్రముఖ విశ్లేషకులు సుమన్​ భట్టాచార్య. అయితే.. ఈ షార్ట్​ కట్స్​ ఏం పనిచేయవన్నది ఆయన అభిప్రాయం.

'' సత్యజిత్​ రే, మృణాల్​ సేన్​, ఉత్పల్​ దత్తా.. వామపక్షవాదులు. అయితే.. వీరి విజయాల్లో.. లెఫ్ట్​ ఏం సాయం చేయలేదు. వీరంతా దిగ్గజాలు. వాళ్లకెలాంటి షార్ట్​ కట్​లు అవసరం రాలేదు.''

- సుమన్​ భట్టాచార్య, రాజకీయ విశ్లేషకులు

ఈ టాలీవుడ్​ రాజకీయం.. ఏ పార్టీకి లబ్ధి చేకూరుస్తుందో వేచి చూడాలి.

294 స్థానాలున్న బంగాల్​ అసెంబ్లీకి 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ.. ఏప్రిల్​ 29న చివరి విడత పోలింగ్​ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి: కౌన్‌ బనేగా బంగాల్​ టైగర్‌?

నందిగ్రామ్​ నుంచే దీదీ సై.. మరి సువేందు?

ప్రచార పర్వం- రసవత్తరంగా బంగాల్ రాజకీయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.