ETV Bharat / bharat

పసికందుపై అత్యాచారం.. ఆపై కిరాతకంగా... - సామూహిక అత్యాచారం

దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుజరాత్​లో ఓ రెండున్నరేళ్ల పసికందుపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆ తర్వాత ఆమెను కిరాతకంగా చంపేశాడు ఓ దుండగుడు. ఆమె మృతదేహం ఓ ఫ్యాక్టరీ సమీపంలో పోలీసులకు కనిపించింది. మరోవైపు ఝార్ఖండ్​లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

gang rape victim
పసికందుపై అత్యాచారం.. ఆపై కిరాతకంగా..
author img

By

Published : Nov 8, 2021, 4:56 PM IST

గుజరాత్​ సూరత్​లో దారుణ ఘటన జరిగింది. రెండున్నరేళ్ల పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ గుర్తుతెలియని వ్యక్తి. అంతటితో ఆగకుండా.. ఆ పసిపాపను ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు.

బిహార్ నుంచి వచ్చిన వలసకూలీల కుటుంబానికి చెందిన ఆ పాప.. దీపావళి రాత్రి ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అదృశ్యమైంది. బాధిత కుటుంబం వెంటనే పండేసరా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు.. ఆ కుటుంబం ఇంటికి ఒక కిలోమీటర్​ దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు(surat rape victim). పంచనామాకు సంబంధించిన వివరాలు సోమవారం పోలీసులకు అందాయి. దుండగుడు ఆ పసికందును బలవంతం చేసి లైంగికంగా వేధించాడని, ఆ తర్వాత చంపేశాడని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లో..

ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లోని ఓ గ్రామంలో 14ఏళ్ల మైనర్ సామూహిక​ అత్యాచారానికి గురైంది. దీపావళి నాడు ఇంటి బయట మట్టి దీపాలు వెలిగిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమెను వ్యవసాయ క్షేత్రాల్లోకి లాక్కెెళ్లారు(up gang rape victim news). అక్కడే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు గురువారం రాత్రి ఇంటికి వెళ్లి జరిగింది కుటుంబసభ్యులకు వివరించింది. ఈ విషయాన్ని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు ధర్మ్​వీర్​, నరేశ్​, ఆశిశ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు వారిని సోమవారం అరెస్ట్​ చేశారు.

ఝార్ఖండ్​లో..

ఝార్ఖండ్​ రాంచీలోని పుందాగ్​లో మరో దారుణ ఘటన బయటపడింది. పోలీస్​ స్టేషన్(pundag police station)​ వెనకే.. ఓ తొమ్మిదేళ్ల చిన్నారి సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యాచారానికి పాల్పడింది కూడా మైనర్లే కావడం గమనార్హం.

శుక్రవారం సాయంత్రం.. ఇద్దరు నిందితులు, బాధితురాలితో పాటు మరికొందరు పిల్లలు మైదానంలో కొంతసేపు ఆడుకున్నారు. చీకటి పడుతోందని మిగిలిన వారు వెళ్లిపోగా.. నిందితులు, బాధిత చిన్నారి అక్కడే ఉండిపోయారు. 6:30గంటల ప్రాంతంలో నిందితులు చిన్నారిని బెదిరించి మైదానం చివర ఉన్న చెట్టు వెనక్కి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటనను చూసిన మరో బాలిక వెంటనే బాధితురాలి తల్లికి సమాచారం అందించింది. ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వారిని ప్రశ్నించగా.. నిందితులు నేరాన్ని అంగీకరించారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.