ETV Bharat / bharat

భారీ భద్రత మధ్య ఉన్నావ్​ బాలికల అంత్యక్రియలు - , ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్​లో ఇద్దరు బాలికలు మృతిUnnao minor girls unconscious Baburaha village

యూపీలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురు బాలికల్లో.. మరణించిన ఇద్దరికి శుక్రవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ మేరకు ఆ గ్రామంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో మరో బాలిక కాన్పుర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Today the funeral of both girls dead body in unnao case
కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఆ బాలికల అంత్యక్రియలు
author img

By

Published : Feb 19, 2021, 1:09 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో కలకలం రేపిన ఇద్దరు బాలికల మృతదేహాలకు శుక్రవారం దహన సంస్కారాలు నిర్వహించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం ఆ బాలికల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించినట్టు స్థానిక ఎస్పీ ఆనంద్​ కులకర్ణి తెలిపారు.

బాబురాహా గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు

"కుటుంబ సభ్యుల ఆచారం ప్రకారం.. ఆ ఇద్దరు బాలికల అంత్యక్రియలు నేడు జరిగాయి. ఇందుకోసం గురువారమే వారికి మృతదేహాలను అప్పగించాం. అయితే.. వారి బంధుమిత్రులు వస్తారని వారు శుక్రవారం వరకు ఆపారు. ఇది పూర్తిగా వారి నిర్ణయమే. ఇందులో ఎవరి ఒత్తిడీ లేదు. మా వృత్తి మేం చేస్తున్నాం."

- ఆనంద్​ కులకర్ణి, ఉన్నావ్​ జిల్లా ఎస్పీ

అంత్యక్రియల సమయంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాబురాహా గ్రామంలో భారీ బలగాలను మోహరించారు అధికారులు.

అనమానాస్పద రీతిలో బాలికలు మృతిచెందడంపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. సెక్షన్​-201 కింద కేసు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో అపస్మారక స్థితిలో ఉన్న మూడవ బాలికకు కాన్పుర్​ ఆసుపత్రిలో వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: జల విలయం- 62కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.