ETV Bharat / bharat

ప్రైవేటు బస్సు ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతి - పరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై ఆందోళన - జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం

Today Road Accident in Anantapur
Today Road Accident in Anantapur
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 6:15 AM IST

Updated : Dec 23, 2023, 11:16 AM IST

06:10 December 23

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి

ప్రైవేటు బస్సు ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతి - పరిహారం చెల్లించాలని జాతీయ రహదారిపై ఆందోళన

Today Road Accident in Anantapur : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద శనివారం వేకువ జామున జాతీయ రహదారి 44పై బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతులు గుత్తి మండలం మామిడూరుకు మృతులు చిన్నతిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున(30), శ్రీనివాసులు(30)గా గుర్తించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్​కు, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పరిహారం చెల్లించాల్సిందే : మృతదేహాలను శవపరీక్షకు తరలించకుండా బంధువులు, స్థానికులు 44వ నెంబర్​ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలను తరలించడానికి వీలు లేదని అన్నారు. దీంతో హైదరాబాదు - బెంగళూరు హైవే పై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుంతకల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వచ్చి తమకు న్యాయం చేయాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు హామీ ఇవ్వడంతో మృతుల బంధువులు నిరసన విరమించుకున్నారు.

Last Updated : Dec 23, 2023, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.