నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..
మేషం
కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు మంచినిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. శివారాధన శుభప్రదం
వృషభం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. గురునామాన్ని జపిస్తే మంచిది.
మిథునం
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రమపెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.
కర్కాటకం
బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది.
సింహం
అనుకున్న పనిని వెంటనే పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. ప్రశాంతమైన జీవనం ఉన్నది. లక్ష్మి ఆరాధన మంచిది.
కన్య
బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. శివ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలరు.
తుల
అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధనా శుభప్రదం.
వృశ్చికం
మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. అవసరమైన వాటిపై దృష్టిసారించండి. ఇష్టదేవతా ఆరాధన శుభం.
ధనుస్సు
అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
మకరం
మనోధైర్యంతో చేసే పనులు మంచినిస్తాయి. మనఃసౌఖ్యం ఉంది. నూతన వస్తువులు కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.
కుంభం
పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందూవినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు.
మీనం
శ్రమపెరుగుతుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. విష్ణు అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.