కర్ణాటక అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఒకేసారి 9 మంది అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి కర్ణాటలోని 11 జిల్లాల్లో 9 మంది అధికారులకు చెందిన 28 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా రేంజ్‌ల ఎస్పీల పర్యవేక్షణలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ అధికారులంతా వేర్వేరు విభాగాలు, శాఖల్లో, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో ఆయా అధికారుల ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ నుంచి టౌన్ ప్లానింగ్ విభాగం ఇంజనీరింగ్ అధికారుల వరకూ ఈ అధికారుల్లో ఉన్నారు. వారి ఆస్తుల వివరాలు లెక్కతీసే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
ఏసీబీ దాడులు చేసిన అధికారుల వివరాలు..
- 1. కృష్ణగౌడ, ఏజీఓ
- 2. హనుమంత శివప్ప చిక్కన్నవర, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్
- 3. సుబ్రమణ్య కే. వద్దర్, టౌన్ ప్లానింగ్ జాయింట్ డైరక్టర్
- 4. మునిగోపాల్ రాజు, సూపరింటెండెంట్, ఇంజినీర్
- 5. చెన్నవీరప్ప. ఎఫ్డీఏ, ఆర్టీఓ కార్యాలయం
- 6. రాజు పత్తార్, అకౌంట్ అధికారి
- 7. విక్టర్ సిమోన్, పోలీస్ ఇన్‌స్పెక్టర్
- 8. కే. సుబ్రమణ్యమ్, జూనియర్ ఇంజినీర్
ఇదీ చదవండి : ఉపాధి పేరుతో తీసుకెళ్లి యువతిపై 11మంది అత్యాచారం