ETV Bharat / bharat

భారత సైన్యం చేతికి 'త్రిశూలం'.. చైనాకు ఇక 'షాక్​'! - chinese army

చైనాకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్‌ ఘర్షణలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో.. డ్రాగన్‌ మూకలు దాడికి తెగబడ్డాయి. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత బలగాలు.. ఇప్పుడు నూతన ఆయుధాలను సమకూర్చుకున్నాయి. సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలు వినియోగించకూడదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో  ప్రాణ హాని లేని నూతన ఆయుధాలు తయారయ్యాయి.

non lethal weapons
భారత సైన్యం చేతికి 'త్రిశూలం'.. చైనాకు ధీటుగా!
author img

By

Published : Oct 18, 2021, 1:27 PM IST

Updated : Oct 18, 2021, 4:53 PM IST

భారత సైన్యం చేతికి 'త్రిశూలం'.. చైనాకు ఇక 'షాక్​'!

శివుడి చేతిలోని త్రిశూలం ఇప్పుడు భారత బలగాల చేతిలో ఆయుధంగా మారింది. కొత్తగా రూపొందించిన గ్లౌజులు తొడుక్కొని ఒక్క పంచ్‌ ఇస్తే.. చైనా సైనికుడు మూర్చపోవాల్సిందే. నయా లాఠీలు తాకితే చాలు.. డ్రాగన్‌ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే.

non lethal weapons
గ్లౌజులు
non lethal weapons
వజ్ర

గల్వాన్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలో వీర సైనికుల మరణంతో.. ప్రాణహాని లేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టి సారించాయి. 1996, 2005 భారత్- చైనా ఒడంబడిక కారణంగా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు తుపాకులు ఉపయోగించకూడదు. అందుకే చైనా బలగాలు ఇనుప రాడ్లు, ఇనుప ముళ్ల లాంటి ఆయుధాలతో భారత బలగాలపై దాడి చేశాయి. ఈ ఒప్పందం దృష్ట్యా.. భారత్‌ కూడా ప్రాణహాని లేని ఆయుధాలను తయారు చేసింది. గల్వాన్ లోయ ఘర్షణ జరిగిన వెంటనే నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ సంస్థకు ఈ ఆయుధాలను తయారుచేసే బాధ్యతను భద్రతా దళాలు అప్పగించాయి. సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా.. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా ప్రాణహాని లేని విధంగా ఈ ఆయుధాలను తయారు చేశారు.

non lethal weapons
త్రీశూలం

పరమ శివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా ఆయుధం తయారు చేశారు. గల్వాన్‌ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారని.. అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారు చేశామని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ వెల్లడించారు.

non lethal weapons
శత్రువు దెబ్బను అడ్డుకునేందుకు..

గత ఏడాది గల్వాన్‌లో భారత్‌-చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుప రాడ్లు, టేజర్‌లను ప్రయోగించారు. దీనికి జవాబు ఇచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహాని లేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టును మాకు అప్పగించాయి. భారత భద్రతా బలగాలకు ఈ ఆయుధాలను అందించడం ప్రారంభించాం. వారి నుంచి చాలా మంచి స్పందన వస్తోంది.

--- మెహిత్‌కుమార్‌, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్

వజ్ర పేరుతో మెరుపులతో కూడిన మెటల్ రాడ్ టేజర్‌ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు.. వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని మోహిత్ కుమార్‌ తెలిపారు. త్రిశూలం నుంచి కూడా విద్యుత్‌ సరఫరా అవుతుందని.. దాని వల్ల ప్రత్యర్థి సెకన్లలోనే షాక్​కు గురవుతాడని వెల్లడించారు. సావర్‌ పంచ్‌ పేరుతో తయారు చేసిన గ్లౌజులు​ కూడా ఇలాంటి పనే చేస్తాయని మోహిత్‌ వివరించారు. ఈ ఆయుధాలేవి శత్రువు ప్రాణాన్ని తీయవని.. కానీ వారిని షాక్​కు గురిచేస్తాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:- చైనా సరిహద్దులో రాత్రింబవళ్లు నిఘా..

Last Updated : Oct 18, 2021, 4:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.