ETV Bharat / bharat

జపాన్ ​​సాంకేతికతతో ఆ గ్రామంలో 'మినీ ఫారెస్ట్' సృష్టి! - 10వేల మొక్కలు నాటిన ఆదర్శ గ్రామం

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంలో మార్పులను చూసి తమిళనాడులోని ఓ గ్రామం తల్లడిల్లిపోయింది. భూగర్భజలాలు ఇంకిపోవడం వల్ల.. వరి, తృణధాన్యాలు పండిన పొలాలు.. బంజరు భూమిగా మారుతుంటే చూస్తూ ఉండలేకపోయారు స్థానికులు. ఆ ఊరికి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ ప్రజలంతా ఏకమయ్యారు. 10వేల మొక్కల్ని నాటి ఆ ఊరిని ఓ 'మినీ ఫారెస్ట్​'లా తీర్చిదిద్దాలకున్నారు. ఆ ప్రణాళికను చక్కగా అమలు చేస్తూ పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Plants, Ideal village
మొక్కల పెంపకం, ఆదర్శ గ్రామం
author img

By

Published : May 22, 2021, 6:35 PM IST

వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోవటం వంటి సమస్యలతో పెను ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఓ చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతూ పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఓ పల్లెటూరు. ఆ ఊరిని ఓ చిరు అడవిలా తీర్చిదిద్దేందుకు పూనుకుని.. 10వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గ్రామస్థులు. అందులో భాగంగా.. ఇప్పటివరకు 2వేల మొక్కలను నాటి.. ఓ చిన్నపాటి అడవినే సృష్టించారు. జపాన్ ​సాంకేతికతను ఉపయోగించి 'మినీ ఫారెస్ట్​'ను రూపొందించిన ఆ గ్రామంపై ప్రత్యేక కథనం.

Plants in Semmani Chettypalayam
సెమ్మని చెట్టిపాలియంలో నాటిన మొక్కలు

ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరిగిపోతున్న నీటి వనరులను చూసి.. తమిళనాడు- కోయంబత్తూర్​ జిల్లా అన్నూర్​ ప్రాంతంలోని సెమ్మని చెట్టిపాలియం గ్రామం తల్లడిల్లిపోయింది. దానికితోడు ఆ పరిసర ప్రాంతాల్లో గత పదేళ్లుగా ఇనుము, ఉక్కు కర్మాగారాలు పుట్టుగొడుగుల్లా పుట్టుకురావడం గమనించింది. కాలానుగుణంగా వర్షాలు లేకపోవడం, పశువుల పెంపకం నానాటికీ తగ్గిపోవడం వంటివి అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలిచివేశాయి. భూతాపంతో.. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.

Mini Forest
మినీ ఫారెస్ట్

ఇదీ చదవండి: 'దేశంలో 80% పల్లెలు వైద్యానికి దూరం'

జపాన్​​ సాంకేతికతను సాయంతో..

జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన స్థానికులు.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు మనుగడ సాగించడం కష్టమనుకున్నారు. దీన్ని అధిగమించి ఆ ఊరిని మళ్లీ పచ్చదనంతో ముంచెత్తాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా ముందడుగేశారు. జపనీయులు వాడే సాంకేతిక పరిజ్ఞానమైన మియావాకీ(జపాన్​ వృక్ష శాస్త్రజ్ఞుడి పేరు) పద్ధతిని అవలంబించారు. అలా.. ఇప్పటివరకు 2వేల మొక్కల్ని నాటి, ఆ గ్రామాన్ని ఓ సుందరమైన అడవిలా తీర్చిదిద్దటంలో తొలి విజయం సాధిచారు. సీతాఫలం, సిమర్​రౌబా గ్లాకా, పూవరాసన్​(పోర్షియా), నిమ్మ వంటి పలురకాల మొక్కలు నాటామని స్థానికులు తెలిపారు.

Mini Forest
మినీ ఫారెస్ట్

ఇదీ చదవండి: 'బాహుబలి' స్ఫూర్తితో విల్లు, బాణాల తయారీ

'మా గ్రామం ఓ నమూనాగా..'

"మా గ్రామాన్ని ఇతరులకు ఓ నమూనాగా మార్చాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. దాన్ని ఊరి ప్రజలందరి మద్దతుతో అమలు చేస్తున్నాం. తొలిదశలో రెండువేల మొక్కలను నాటాం. మేము చేపట్టిన ఈ పచ్చదనం కృషితో.. వర్షాలు, భూగర్భజలాలు మళ్లీ పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం మా ఊరి యువతకు మంచి ప్రేరణగా నిలుస్తోంది."

-పాకియరాజ్​, స్థానిక ఉపాధ్యాయుడు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా.. పట్టణ పంచాయతీ సహకారంతో ఆ మొక్కలకు కంచెలు వేయాలనుకున్నామని పాకియరాజ్​ చెప్పుకొచ్చారు.

Mini Forest
మినీ ఫారెస్ట్

ఇదీ చదవండి:జీవజాతులకు పెను ముప్పు!

'చూస్తూ ఉండలేకపోయాం..'

"మా ఊళ్లో భూగర్భజలాలు 100 అడుగుల లోతుకు క్షీణించాయి. ఎంతో సారవంతమైన భూమి అంతా బంజర భూమిగా మారింది. ఒకప్పుడు వరి, ఇతర తృణధాన్యాలను సాగు చేసిన భూములిప్పుడు నివాస స్థలాలుగా మారాయి. ఈ పరిస్థితుల్ని అధిగమించి.. గ్రామంలో మళ్లీ పచ్చటి వాతావరణం నెలకొల్పాలనుకున్నాం. అందుకోసం ప్రజల సహకారంతో ఓ చిన్న అడవిని సృష్టించాలనుకున్నాం."

-రఘురమణ, స్థానికుడు

అలా తమ ప్రతిపాదనతో గ్రామస్థులంతా ఏకమై.. ఒక్కో వ్యక్తి ఒక మొక్కతో పాటు, ప్రతి ఇంటి నుంచి ఓ నీటి కుండ తేవాలని నిర్ణయించుకున్నామని రఘురమణ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఊరి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: మతి పోగొట్టే మానవత్వం!

పొరుగు గ్రామాలకు ఆదర్శంగా..

సెమ్మని చెట్టిపాలియం గ్రామస్థులు అవలంబించిన ఈ పథకం విజయవంతం కావడం వల్ల.. ఆ అటవి పునరుద్ధరణ నమూనాను అనుకరించేందుకు పొరుగు గ్రామాల యువకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. స్థానికుల ప్రయత్నాలతో ఆ గ్రామం త్వరలోనే ఓ పచ్చని అడవిలా, పక్షుల అభయారణ్యంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా.. ఊరు కోల్పోయిన పూర్వవైభవాన్ని మళ్లీ ఈ 'మినీ-ఫారెస్ట్​' ద్వారా తిరిగి దక్కుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి: బాలుడి అద్భుత బ్యాటింగ్​కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.