ETV Bharat / bharat

రూ.3 కోట్ల స్కాలర్​షిప్​తో అమెరికన్ వర్సిటీకి రైతు బిడ్డ - farmers' daughter

Swega Saminathan: తమిళనాట ఓ రైతు కుమార్తె 17 ఏళ్ల స్వెగ సామినాథన్‌ షికాగో విశ్వవిద్యాలయం నుంచి రూ.3 కోట్లు ఉపకారవేతనాన్ని దక్కించుకుంది. ఆమె విజయ రహస్యమేంటో తెలుసుకుందాం.

TN farmer's girl Swega Saminathan
TN farmer's girl Swega Saminathan
author img

By

Published : Dec 23, 2021, 3:12 PM IST

Updated : Dec 23, 2021, 5:29 PM IST

షికాగో విశ్వవిద్యాలయం నుంచి రూ. 3 కోట్ల స్కాలర్​షిప్​

Swega Saminathan: ఈరోడ్‌లోని కాశిపాలయం గ్రామానికి చెందిన రైతు దంపతులకు పుట్టిన స్వెగ సామినాథన్‌ చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేది. 16 ఏళ్లు వస్తే ఆడపిల్లకు వివాహం జరిపించాలనేది ఆ ప్రాంత సంప్రదాయం. అయితే ఆ దంపతులు మాత్రం తమ ముద్దుల కూతురికి చదువుపై ఉన్న ఆసక్తికే ప్రాముఖ్యం ఇచ్చారు. గ్రామీణప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించేందుకు డెక్సెటెరిటీ గ్లోబల్‌ సంస్థను 2008లో ప్రారంభించారు సాగర్‌ అనే సామాజిక కార్యకర్త. అలా స్వెగను ఆమె 14వ ఏట ఈ సంస్థ గుర్తించింది. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే ఈమె కలను సాకారం చేయడానికి అప్పటి నుంచే ప్రత్యేక శిక్షణను అందించడం మొదలుపెట్టింది. రెండేళ్లలోనే చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు, కెరీర్‌ అభివృద్ధి వంటి కార్యక్రమాల్లో పాల్గొనే స్థాయికి స్వెగ ఎదిగింది. తాజాగా ఇంటర్‌ పూర్తిచేసిన ఈమె ప్రపంచ ప్రసిద్ధి చెందిన షికాగో విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివే అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా, రూ.3 కోట్లు ఉపకారవేతనాన్ని కూడా గెలుచుకుంది.

TN farmer's girl Swega Saminathan
తల్లిదండ్రులతో స్వెగ సామినాథన్​

Tamil Nadu Farmer's Daughter Wins Rs 3 Crore Scholarship

నమ్మలేకపోతున్నా.. 'నాన్న చదువుకోలేదు. అమ్మ గృహిణి. మా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరూ చదువుకోకపోయేసరికి నాకు పెద్ద చదువులు చదవాలని ఉండేది. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు డెక్సెటెరిటీ గ్లోబల్‌ సంస్థ వాళ్లు మా స్కూల్‌కు వచ్చారు. మంచి మార్కులు తెచ్చుకుంటూ, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న నాలాంటి కొందరిని ఎంపిక చేశారు. చదువుతోపాటు పలురకాల అంశాల్లో శిక్షణనిచ్చే తరగతులకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. అలా ఇంటర్‌ పూర్తిచేశా. ఈలోపు విదేశాల్లో డిగ్రీ చేయడానికి ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాశా. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన షికాగో విశ్వ విద్యాలయంలో నాకు సీటు రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అమ్మానాన్నల ఆనందానికి అంతులేదు. మా కుటుంబాల్లో నేను మాత్రమే చదువుకుంటుండగా, విదేశాలకు వెళ్లనున్న మొదటి దాన్ని కూడా నేనే కావడం గర్వంగా ఉంది. చదువు.. ఆ తర్వాతే వివాహం అనే భావం అందరిలో రావాలని ఆశిస్తున్నా. సైంటిస్ట్‌గా ఎదిగి మన దేశానికి సేవలు అందించాలని ఉంది.' అని అంటోంది స్వెగ.

TN farmer's girl Swega Saminathan
స్వెగ సామినాథన్​

ఆమెకు రూ. 1.5 కోట్లు..

దేశంలోనే అత్యధిక ఉపకార వేతనాన్ని అందుకున్న క్రీడాకారిణిగా నిలిచింది 18 ఏళ్ల కృష్ణా జయశంకర్‌. ఈమెది చెన్నై. డిస్కస్​ త్రోయర్​ అయిన కృష్ణకు టెక్సాస్‌ విశ్వవిద్యాలయం 'అకడెమిక్‌ అండ్‌ అథ్లెటిక్‌ స్కాలర్‌షిప్‌'గా రూ.1.5 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇంత భారీ ఉపకారవేతనాన్ని అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందంటోంది కృష్ణ.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్వేతా రెడ్డి(17) అనే ఓ విద్యార్థిని ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్​షిప్​ను పొందింది. ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మకమైన లాఫాయేట్​ కళాశాల స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేసింది.

ఇవీ చూడండి: జర్మనీ అబ్బాయి.. రష్యా అమ్మాయి.. భారత్​లో పెళ్లి

రూ.5 కోట్లు పలికిన గుర్రం.. అయినా అమ్మేందుకు ఓనర్ నో!

Last Updated : Dec 23, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.