ETV Bharat / bharat

తమిళనాడు సీఎం రాజీనామా- గవర్నర్​ ఆమోదం - తమిళనాడు రాజకీయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి రాజీనామా చేశారు. దీనిని ఆమోదించిన గవర్నర్​ బన్వారిలాల్​ పురోహిత్​.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంతవరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు.

TN CM K Palaniswami resigns
తమిళనాడు సీఎం రాజీనామా
author img

By

Published : May 3, 2021, 7:28 PM IST

Updated : May 3, 2021, 8:05 PM IST

తమిళనాడు సీఎం పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. దీనిని గవర్నర్ బన్వారిలాల్​ పురోహిత్ ఆమోదించారు. ఇది సోమవారం (ఈనెల 3వ తేదీ) నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేంత వరకు పళనిస్వామిని ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని సూచించారు.

సీఎం రాజీనామా నేపథ్యంలో 15వ(2016-2021) అసెంబ్లీని గవర్నర్​ రద్దు చేసినట్లు రాజ్​భవన్ పేర్కొంది.

ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 234 స్థానాలకు గానూ.. 133 సీట్లు సాధించిన డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అధికార అన్నాడీఎంకే 66 స్థానాలకే పరిమితమై ఓటమి పాలైంది.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరదలు- దెబ్బతిన్న ఇళ్లు

Last Updated : May 3, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.