ETV Bharat / bharat

స్టాలిన్​ కేబినెట్​లో గాంధీ, నెహ్రూలు! - తమిళనాడు అసెంబ్లీ

తమిళనాట మరోసారి నేతలు పేర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ స్టాలిన్​, ఇద్దరు గాంధీలు, ఓ నెహ్రూ ఉన్నారు. వీరిలో స్టాలిన్​ సీఎం కాగా, గాంధీ, నెహ్రూ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.

tamilnadu ministers gandhi and nehru
తమిళనాడు అసెంబ్లీ
author img

By

Published : May 7, 2021, 8:47 PM IST

తమిళనాడులో వ్యక్తుల పేర్లు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. తాము గౌరవించే వ్యక్తులు, సిద్ధాంతాల ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలకు పేర్లు పెడతారు. ఇది కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. పలువురు తమ పిల్లలకు స్వాతంత్య్రయోధుల పేర్లు పెట్టగా, ఇంకొంత మంది కమ్యూనిస్ట్​ నాయకుల స్ఫూర్తితో వారి పేర్లను పెడుతుంటారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో వివిధ నేతలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ పేర్లకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

ఒక స్టాలిన్​, ఇద్దరు గాంధీలు..

దివంగత నేత కరుణానిధి నాటి సోవియట్​ నియంత జోసెఫ్​ స్టాలిన్​ పేరును ఆయన కుమారుడికి పెట్టారు. ఆయనే ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్​. ప్రస్తుతం స్టాలిన్​ కేబినెట్​లో ఓ గాంధీ, ఓ నెహ్రూ ఉన్నారు. చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రిగా ఆర్​ గాంధీ, పురపాలక శాఖ​ మంత్రిగా కేఎన్​​ నెహ్రూలు బాధ్యతలు చేపట్టారు.

వీరితో పాటు మరో గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నారు. భాజపాకు చెందిన ఎంఆర్​ గాంధీ నాగర్​కోయిల్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

తమిళ మంత్రివర్గంలో తెలుగు వారు..

  • కేఎన్​ నెహ్రూ (పురపాలక శాఖ)
  • కేకేఎస్ఎస్​ఆర్​ రామచంద్రన్ (ఆర్థిక, విపత్తు నిర్వహణ శాఖ)
  • ఆర్​ గాంధీ (చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ)
  • పీకే శేఖర్​బాబు (దేవాదాయ శాఖ)

ఇదీ చదవండి : 'గ్రామాలను చుట్టేస్తున్న వైరస్​.. టీకానే మార్గం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.