బంగాల్ పశ్చిమ మేదినీపుర్‌లోని కేశ్పుర్లో ఓ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
కేశ్పుర్లోని స్థానిక టీఎంసీ కార్యకర్త ఉత్తమ్ దోలుయ్(48)పై పది నుంచి పదిహేను మంది దుండగులు.. పదునైన ఆయుధాలతో దాడి చేశారని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఉత్తమ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.
భాజపా కార్యకర్తలే.. ఉత్తమ్‌ని హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇదీ చూడండి: బంగాల్-అసోంలో జోరుగా రెండో దశ పోలింగ్