ETV Bharat / bharat

దినేశ్​పై టీఎంసీ ఆగ్రహం- స్వాగతించిన భాజపా

తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) ఎంపీ దినేశ్​ త్రివేదీ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దినేశ్​ కృతజ్ఞత లేని వ్యక్తి అని పేర్కొంది. అయితే.. దినేశ్​ తమ పార్టీలో చేరితే స్వాగతిస్తామని భాజపా తెలిపింది.

dinesh trivedi
దినేశ్​పై టీఎంసీ ఆగ్రహం- భాజపా స్వాగతం
author img

By

Published : Feb 12, 2021, 7:55 PM IST

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)ను షాక్​కు గురిచేస్తూ ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు దినేశ్​ త్రివేదీ తన ఎంపీ పదవికి సభలోనే రాజీనామా ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు తానేమీ చేయలేకపోతున్నానని, అందుకే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు త్రివేది తెలిపారు. ఆయన తన రాజీనామా సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

"మమతా బెనర్జీ చేతుల్లో టీఎంసీ ఎక్కువ కాలం ఉండదు. రాజకీయాలు అర్థం చేసుకోలేని కార్పొరేట్​ ప్రొఫెషనల్స్​ ఆ పార్టీని హస్తగతం చేసుకుంటున్నారు. పార్టీలో నేతల అభిప్రాయాలను వినేందుకు అవకాశం లేదు."

--దినేశ్​ త్రివేది

నష్టమేం లేదు..

అయితే.. పార్టీలో తన ఇబ్బందుల గురించి ఇది వరకు ఎప్పుడూ సీఎం మమతా బెనర్జీతో త్రివేదీ చర్చించలేదని టీఎంసీ పేర్కొంది. ఆయన పార్టీని వీడటం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ వివేక్​ గుప్తా పేర్కొన్నారు.

"రాష్ట్రంలోని హింసతో త్రివేదీ ఇబ్బంది పడుతున్నారని వినడం ఇదే మొదటి సారి. ఆయన నిజంగా హింస వల్ల బాధపడుతున్నది నిజమేనైతే.. అది భాజపా చేసిన హింసవల్లేనా? 2010 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎలాంటి హింసా లేదు. బంగాలీలు మెదడుతో పోటీపడుతారు. అంతే కానీ, శారీరకంగా కాదు. దినేశ్​ వ్యాఖ్యలు మమ్మల్ని షాక్​కు గురిచేశాయి. ఆయన పార్టీనీ వీడటం వల్ల తృణమూల్​కు వచ్చే నష్టమేమీ లేదు.

-- వివేక్​ గుప్తా, టీఎంసీ అధికార ప్రతినిధి

తన రాజీనామా గురించి దీదీతో దినేశ్​ చర్చించి ఉండరని వివేక్​ గుప్తా​ అభిప్రాయపడ్డారు. ఏదో ఓ లక్ష్యం కోసం ఆయన ఈ భావోద్వేగపరమైన నిర్ణయం తీసుకుని ఉండి ఉంటారని అన్నారు.

ఆయన అసలైన రంగు ఇది..

దినేశ్​​ త్రివేదీ కృతజ్ఞతలేని వ్యక్తి అని టీఎంసీ నేత శేఖర్​ రాయ్​ విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని దినేశ్​ వమ్ము చేశారని అన్నారు.

"ఇన్నేళ్లుగా పార్టీలో ఉన్న దినేశ్​ త్రివేదీ.. ఏ రోజు నోరు మెదపలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయమే ఉందనగా.. ఆయనకు పార్టీలో ఇబ్బందులు గుర్తొస్తాయి. ఇది ఆయన అసలైన రంగులేంటో చూపిస్తోంది. అతను కృతజ్ఞత లేని వ్యక్తి. ప్రజల నమ్మకాన్ని వంచించారు.''

-- శేఖర్​రాయ్​, టీఎంసీ నేత

'త్రివేదీ లాంటి వ్యక్తులు అధికారాన్ని అనుభవిస్తారు. తీరా ఎన్నికల సమయం దగ్గరపడుతుంటే వదిలేస్తారు. ఆయనకు పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పుడో చెప్పి ఉండాలి' అని మరో నేత సౌగతా రాయ్​ విమర్శించారు.

గత ఎన్నికల్లో దినేశ్​ త్రివేదీ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవ్వగా.. రాజ్యసభకు టీఎంసీ ఎంపిక చేసింది.

ఇది ఆరంభమే..

దినేశ్​ రాజీనామాపై స్పందించిన భాజపా.. ఇది టీఎంసీ అంతానికి ఆరంభం అని పేర్కొంది. త్వరలోనే తృణమూల్​ విచ్ఛిన్నమవుతుందని బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్ వ్యాఖ్యానించారు. దినేశ్​ త్రివేదీ తమ పార్టీలో చేరాలనుకుంటే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. త్రివేదీ గొప్ప నేత అని భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయ్​వర్గీయ అన్నారు.

ఇదీ చదవండి:'రాహుల్​ మానసిక స్థితి సరిగా లేదేమో!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.