బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రి అంకుల్ అంటూ సంబోధించారు. తన కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్ భవన్‌లో ప్రత్యేక విధుల్లో (ఓఎస్‌డీ) అధికారులుగా నియమించారని ఆరోపించారు. ఈ మేరకు పలు పేర్లతో కూడిన జాబితాను ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు.
అబ్బుదోయ్ సింగ్ సేఖావత్ (ఓఎస్‌డీ-గవర్నర్), అఖిల్ చౌదరి(కో-ఆర్డినేషన్), రుచి దుబే(పరిపాలన), ప్రశాంత్ దీక్షిత్(ప్రోటోకాల్), కౌస్తవ్ ఎస్ వాలికర్(ఐటీ), కిషన్ ధంకర్ వంటి అధికారులు రాజ్‌భవన్‌లో ఓఎస్డీలుగా నియమితులయ్యారని.. వీరిలో షెఖావత్ జగ్దీప్ ధన్‌ఖర్ బావ కుమారుడని, రుచి దూబే, ప్రశాంత్ దీక్షిత్ అతని మాజీ సహాయకుడు మేజర్ గోరాంగ్ దీక్షిత్ భార్య సోదరుడని మహువా మొయిత్రీ తెలిపారు. వాలికర్ జనార్ధన్ రావుకు బావ అని.. కిషన్ ధన్‌కర్ గవర్నర్‌కు దగ్గరి బంధువు అని మొయిత్రా ఆరోపించారు.
-
Uncleji only way WB’s “grim situation” will improve is if you move your sorry self back to Delhi & find another job.
— Mahua Moitra (@MahuaMoitra) June 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Some suggestions:
1. Advisor to Ajay Bisht YogiCM on how best to Thok Do opposition
2. Advisor to Home Min on how best to hide during a pandemic https://t.co/oWLW0Ciupg
">Uncleji only way WB’s “grim situation” will improve is if you move your sorry self back to Delhi & find another job.
— Mahua Moitra (@MahuaMoitra) June 6, 2021
Some suggestions:
1. Advisor to Ajay Bisht YogiCM on how best to Thok Do opposition
2. Advisor to Home Min on how best to hide during a pandemic https://t.co/oWLW0CiupgUncleji only way WB’s “grim situation” will improve is if you move your sorry self back to Delhi & find another job.
— Mahua Moitra (@MahuaMoitra) June 6, 2021
Some suggestions:
1. Advisor to Ajay Bisht YogiCM on how best to Thok Do opposition
2. Advisor to Home Min on how best to hide during a pandemic https://t.co/oWLW0Ciupg
గవర్నర్‌ను ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉందని మొయిత్రీ తెలిపారు.
"గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. అయితే.. తమను తాము అద్దంలో చూసుకోమని వారిని కోరుతున్నాను. ఆయన తన గ్రామం మొత్తాన్ని రాజ్ భవన్‌లోకి తీసుకువచ్చారు."
-మహువా మొయిత్రీ, టీఎంసీ ఎంపీ
గవర్నర్ వరుస ట్వీట్లు..
బంగాల్‌లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసతో శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారాయాని రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార దాడుల గురించి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో తనకు వివరించేందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేదిని ఆదేశించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. విపక్షాలపై దాడుల అంశంలో అధికారపక్షం పోలీసులతో రాజీపడిందని ఆరోపించారు.
తృణమూల్‌కు వ్యతిరేకంగా ఓటేసిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయన్న గవర్నర్.. ఫలితంగా లక్షలాది మంది తరలిపోతున్నట్లు చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, సామాజిక బహిష్కరణలు సైతం రాష్ట్రంలో జరుగుతున్నట్లు జగదీప్ ధన్‌కర్ ఆరోపించారు.
ఇవీ చదవండి: 'భాజపా కార్యకర్తలైనందుకే చెట్లకు కట్టేసి కొట్టారు'