ETV Bharat / bharat

'దీదీ మాఫియా సభ్యులకు భాజపాలోకి నో ఎంట్రీ'

బంగాల్​ రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో బలమైన శక్తిగా మారిన భాజపా... అధికార పార్టీకి సవాల్​ విసురుతోన్న నేపథ్యంలో తృణమూల్​కు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. సీనియర్​ నాయకులు పార్టీని వీడుతున్న తరుణంలో నాటి ప్రత్యర్థి అయిన వామపక్షాలనూ తమకు మద్దతుగా నిలవాలని తృణమూల్​ కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అధికార పీఠం తమదే అంటున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

kailash vijaywargiya interview
'మాఫియాలోలేని తృణమూల్​ నేతలకే భాజపాలో చోటు'
author img

By

Published : Jan 21, 2021, 1:52 PM IST

ప్రత్యేక ఇంటర్వ్యూలో కైలాశ్​ విజయవర్గీయ

ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బంగాల్​ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీనియర్​ నాయకులు పార్టీని వీడుతున్న తరుణంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్​కు ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో బలీయమైన శక్తిగా మారుతూ ఈసారి అధికారం తమదేనంటూ తృణమూల్​కు సవాల్ విసురుతోంది భాజపా. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

బంగాల్​లో అధికార పీఠమెక్కేందుకు భాజపా ఎలాంటి వ్యూహాలు రచిస్తోందనే విషయంపై భాజపా రాష్ట్ర ఇంఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ 'ఈటీవీ-భారత్'​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

భాజపా, తృణమూల్​ మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో ఇంకా ఎంత మంది టీఎంసీ నేతలు భాజపాలోకి చేరనున్నారు?

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరి వల్ల చాలా మంది తృణమూల్​ నేతలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత పార్టీని వీడి భాజపాలోకి చేరాలని ఆశిస్తున్నారు. దీదీ మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ మాఫియా గ్రూప్​లో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారు.

ఆవుల అక్రమ రవాణా, దొంగ నోట్ల ముద్రణ, బొగ్గు మాఫియా వంటి వాటిలో తృణమూల్​ నేతలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మాఫియాతో సంబంధమున్న నేతలను పార్టీలో చేరాలని భాజపా ఆహ్వానించదు. ప్రధాని నేతృత్వంలో బంగాల్​ అభివృద్ధికి కృషి చేసే లక్ష్యంతో ముందడుగు వేసే నేతలకే భాజపా స్వాగతం పలుకుతుంది.

ఇదీ చదవండి:బంగాల్​ గడ్డ మీద తృణమూల్​కు భాజపా 'సవాల్​'

మరికొంత మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని భాజపా చెబుతోంది. ఇతర పార్టీ నేతల రాక భాజపాలో ఎక్కువవుతోంది అనే అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?

నేతలందరితో చర్చించాకే పార్టీ ఓ తుది నిర్ణయం తీసుకుంటుంది. భాజపా నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీలో ఎవరైనా చేరాల్సి వస్తే... ప్రతి ఒక్కరినీ సంప్రదించి అందరూ ఏకీభవిస్తేనే ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తాం.

బంగాల్​లో జరుగుతోన్న అల్లర్లకు కారణం అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్​ అని భాజపా ఆరోపిస్తోంది. రానున్న ఎన్నికల సందర్బంగా మరిన్ని అల్లర్లు జరిగే అవకాశముందా?

భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతున్న అంశాన్ని బంగాల్​ ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అల్లర్లకు ఆజ్యం పోస్తూ తమ మద్దతు దారులను రెచ్చగొడుతున్నారు.

ఇదీ చదవండి:

కామ్రేడ్స్​... మాకు సాయం చేయండి: టీఎంసీ

బంగాల్​ వ్యాప్తంగా భాజపా 'పరివర్తన యాత్ర'లు

భాజపా అమలులోకి తెచ్చిన 'ఏక్ ముత్తి చావల్ సంగ్రా' కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఓట్ల పెంపునకు ప్రజల్ని మభ్యపెట్టే పనేనా?

ఇది పరోక్షంగా ఓట్ల పెంపునకు చేపట్టిన కార్యక్రమం కాదు. రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వానికి ఉన్న ఆసక్తికి ప్రతిరూపం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాం.

మోదీ ప్రభుత్వం 'పీఎం కిసాన్​ సమ్మాన్ నిధి' ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తోంది. కానీ, ఈ డబ్బు బంగాల్​ రైతులకు చేరడంలేదు. కేంద్రం అమలు చేస్తోన్న ఇతర పథకాల వల్లా రైతులు లబ్ధి పొందలేకపోతున్నారు. బంగాల్​లో భాజపా అధికారంలోకి వస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అప్పుడే పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయగలం.

మొదటి నుంచి భాజపా, తృణమూల్​ నేతల మధ్య వాడీవేడి వాగ్వాదం కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో భాజపా కీలక నేతలు బంగాల్​లో అడుగుపెట్టనున్నారా?

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బంగాల్​లో చాలా కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరివర్తన యాత్ర చేసేందుకూ పార్టీ సన్నాహాలు చేస్తోంది.

బంగాల్​లో ప్రభుత్వం ఏర్పాటు చేయగలమనే నమ్మకం భాజపాకు ఉందా?

ఈ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఇదీ చదవండి:దిల్లీకి వెళ్లట్లేదు- టీఎంసీతోనే ఉంటా: శతాబ్ది రాయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.