ETV Bharat / bharat

టీఎంసీ జాబితాపై సీనియర్ల అసంతృప్తి- పార్టీకి గుడ్​బై! - బంగాల్​ ఎన్నికలు

తృణమూల్​ కాంగ్రెస్​పై సీనియర్​ నేతల నుంచి వ్యతిరేకత కొనసాగుతోంది. ఎన్నికల అభ్యర్థుల జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత సోనాల్​ గుహా భాజపాలో చేరనున్నట్లు సూచనలు చేశారు. మరో కీలక నేత జటు లాహిరీ పార్టీకి రాజీనామా చేశారు.

bjp, trinamool
భాజపా గూటికి మరో తృణమూల్ నేత!
author img

By

Published : Mar 6, 2021, 7:11 PM IST

తృణమూల్​ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్​ దక్కలేదని ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయగా మరొకరు భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు.​ తృణమూల్ కీలక నేత, సత్​గాచియా ఎమ్మెల్యే సోనాల్​ గుహా.. భాజపాలో అడుగుపెట్టనున్నట్టు సూచనలు చేశారు. బంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు ముకుల్​ రాయ్​ను సంప్రదించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని సోనాల్​ గుహా శనివారం ప్రకటించారు.

"మమతా దీదీకి మంచి ఆలోచనలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. పార్టీ మొదలు నుంచి నేను ఆమెతో ఉన్నాను. ఓ రాజకీయ నేతను అయ్యి ఉండి పదవి లేకుండా ఉండలేను. నా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. నేను ఓ గౌరవీయ స్థానంలో కొనసాగాలని కోరుకుంటున్నాను."

- సోనాల్ గుహా, తృణమూల్ సీనియర్​ నేత

షిబ్​పూర్​ ఎమ్మెల్యే రాజీనామా..

ఎమ్మెల్యే అభ్యర్థిగా జాబితాలో తన పేరు చేర్చకపోవడంపై తృణమూల్ సీనియర్ నేత, షిబ్​పూర్​ ఎమ్మెల్యే జటు లాహిరి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వైఖరిని తప్పుపట్టారు. ఈ సందర్భంగా శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

"నేను పార్టీకి విధేయుడిగా ఉంటున్నా.. మమతా బెనర్జీ నన్ను పక్కన పెట్టారు. నాకు నామినేషన్​ దక్కలేదన్న బాధ కంటే ఎవరో ఓ బయట వ్యక్తికి అవకాశం ఇవ్వడమే బాధ కలిగిస్తోంది. అతను పార్టీలో చేరి ఎక్కువ కాలం కూడా కాలేదు. తృణమూల్​కు మా సేవలు అవసరం లేదని తెలుస్తోంది. కాబట్టీ నేను ఈ పార్టీని వీడుతున్నాను."

-జటు లాహిరీ, మాజీ తృణమూల్ నేత

భాజపాలో చేరే అవకాశం ఉందని లాహిరీ సూచనలు అందించారు. అయితే ఈ విషయాన్ని భాజపా ఖండించింది. లాహిరీ పార్టీలో చేరడంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. జటు లాహిరీ స్థానంలో తృణమూల్ మాజీ క్రికెటర్ మనోజ్​ తివారీకి అవకాశం ఇచ్చింది.

ఇదీ చదవండి : భాజపాలో చేరిన టీఎంసీ మాజీ ఎంపీ దినేశ్​ త్రివేది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.