ETV Bharat / bharat

భాజపాలోకి మరో తృణమూల్​ నేత - బంగాల్​ ఎన్నికలు

బంగాల్​లో ఫిరాయింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా తృణమూల్​ కాంపౌండ్​ నుంచి సీనియర్​ నేత జితేంద్ర తివారి భాజపాలో చేరారు. దీంతో తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

tmc, bjp
భాజపాలోకి మరో తృణమూల్​ నేత
author img

By

Published : Mar 2, 2021, 8:09 PM IST

తృణమూల్​ కాంగ్రెస్​కు పార్టీ ఫిరాయింపుల ముప్పు తప్పట్లేదు. తాజాగా మరో కీలక నేత భాజపాలో చేరారు. పార్టీ సీనియర్​ నేత, పండబేశ్వర్​ నియోజకవర్గం ఎమ్మెల్యే జితేంద్ర తివారి మంగళవారం.. భాజపా కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై జితేంద్ర అసంతృప్తి వ్యక్తం చేయసాగారు.

ఎట్టకేలకు భాజపాకు..

గతేడాది డిసెంబరులో భాజపాలో చేరేందుకు మొగ్గు చూపినా, ఆ పార్టీ తిరస్కరించింది. ఎట్టకేలకు హూగ్లీ జిల్లా శ్రీరాంపుర్​లో భాజపా నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్​ సమక్షంలో జితేంద్ర పార్టీ మారారు. దీంతో దీదీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

'రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను భాజపాలో చేరాను. తృణమూల్​లో ఇప్పుడు పార్టీ కోసం పనిచేసే పరిస్థితులు లేవు' అని జితేంద్ర పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'టీఎంసీ రాజకీయాలతో దేశ భద్రతకే ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.