parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(tmc on congress). ఈ సమావేశాల్లో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా లేమని(tmc congress) ప్రకటించింది. అయితే, వివిధ అంశాలపై ఇతర విపక్షాలకు సహకరిస్తామని స్పష్టం చేశారు టీఎంసీ సీనియర్ నేత ఒకరు. నవంబర్ 29న కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చిన విపక్షాల సమావేశానికి(opposition parties meet) తమ పార్టీ హాజరవటం లేదని తెలిపారు.
కాంగ్రెస్, టీఎంసీల(trinamool congress) మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అంతర్గతంగా నేతల మధ్య సమన్వయం చేస్తూ ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని ఎద్దేవా చేశారు టీఎంసీ నేత.
" శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచే ఆలోచన లేదు. కాంగ్రెస్ నేతలు ముందు వారి మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలి. సొంత ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలి. ఆ తర్వాత ఇతర పార్టీలతో దోస్తీ కోసం ప్రయత్నించాలి. ప్రజాప్రయోజనాల కోసం వివిధ అంశాలను లేవనెత్తుతూ.. ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతాం. "
- టీఎంసీ సీనియర్ నేత
భాజపాపై పోరాటానికి కాంగ్రెస్‌తో కలిసేందుకు ఇష్టపడకపోవటంపై ప్రశ్నించగా.. ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని ఎద్దేవా చేశారు టీఎంసీ నేత(trinamool congress). నవంబర్ 29న బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(mamata banerjee news) ఇంట్లో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. ' సాగు చట్టాల రద్దు(Farm laws repeal), కనీస మద్దతు ధర కల్పించే చట్టం, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపు, బీఎస్ఎఫ్ పరిధి పెంపు, ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం, చమురు ధరల పెరుగుదల, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి అంశాలు మా ప్రణాళికల్లో ఉన్నాయి' అని తెలిపారు.
ఇదీ చూడండి: ఆ మూడు డిమాండ్లతో.. పార్లమెంట్‌కు కాంగ్రెస్