ETV Bharat / bharat

30 శాతానికిపైగా కొత్త అభ్యర్థులకే తృణమూల్​ టికెట్లు! - బంగాల్​ రాజకీయాలు

బంగాల్‌లో 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్​‌ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దాదాపు 30 శాతం పైగా సీట్లు యువకులు, మహిళలు కొత్తవారికి కేటాయించాలని నిర్ణయించింది. 75 ఏళ్లు నిండిన వారు, నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్ నిరాకరిస్తోంది.

Bengal polls: TMC likely to drop several sitting MLAs
తృణమూల్​ సిట్టింగ్​లకు నో ఛాన్స్​
author img

By

Published : Mar 1, 2021, 8:16 PM IST

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేందుకు మమతా బెనర్జీ సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధ ప్రాంతాల్లో మంచి పేరున్న యువకులు, మహిళలకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే దీనిపై మమత నియమించిన 12 మంది సభ్యుల ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. ఎన్నికల కమిటీతో సోమవారం జరిగిన సమావేశంలో అభ్యర్థుల జాబితాను త్వరగా పూర్తి చేయాలని నాయకులకు దీదీ దిశానిర్దేశం చేశారని టీఎంసీ నేతలు తెలిపారు.

ఐ-ప్యాక్​కే బాధ్యతలు..

బంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 30 శాతం కొత్త అభ్యర్థులను తీసుకునేందుకు టీఎంసీ ఎన్నికల కమిటీ కసరత్తు చేస్తోంది. వీరితో పాటు 19 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరడంతో ఏర్పడిన ఖాళీ స్థానాల్లోనూ కొత్తవారినే నిలపాలని మమత ఆదేశించినట్లు సమాచారం. కొత్త అభ్యర్థుల ఎంపికలో రాజకీయ విధాన కర్త ఐ-ప్యాక్‌ అధినేత ప్రశాంత్‌ కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

పనితీరే ప్రామాణికం..

గత ఐదేళ్లలో బంగాల్‌లోని ఆయా నియోజకవర్గల్లో ఎమ్మెల్యేల పనితీరు, వారి పట్ల ప్రజాభిమానాన్ని ప్రమాణంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీలో 75 ఏళ్లు నిండినవారికి కూడా ఈసారి టిక్కెట్‌ నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించగా ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు కేటాయించాలని ఎన్నికల కమిటీని మమత ఆదేశించారు.

భాజాపాతోనే అసలు పోటీ..

2016 ఎన్నికల్లో 211 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకుంది. లెప్ట్‌-కాంగ్రెస్‌ కూటమి 77 స్థానాలు గెలుచుకోగా.. భాజపా 3 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తం 42 పార్లమెంటు స్థానాల్లో భాజపా 18 చోట్ల నెగ్గి తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో భాజపాకు అధికారం చిక్కకుండా చూసేందుకు అభ్యర్థుల ఎంపికలో టీఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గాల్లో అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తోంది.

ఇవీ చదవండి: బంగాల్​ దంగల్: 'సొంత కుమార్తే కావాలి.. మేనత్త కాదు'

'బంగాల్​లో హంగ్ వస్తే భాజపాతో మమత పొత్తు'

బంగాల్​లో 8 దశల పోలింగ్​పై సుప్రీంలో పిటిషన్

'లాలూ నిర్ణయంతోనే తృణమూల్​కు ఆర్జేడీ మద్దతు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.