ETV Bharat / bharat

Devotees' anger against Om Raut : ఓం రౌత్.. ఇదేం పని..? మండిపడుతున్న భక్తులు - adipurush Pre release event

Devotees' anger against Om Raut : అదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్​పై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం తిరిగి వెళ్తూ.. హీరోయిన్ కృతి సనన్​ను ఆయన కౌగిలించుకున్నారు. టాటా చెప్తూ.. దగ్గరికి వచ్చి.. ఆమె చెంపపై ముద్దు పెట్టుకుని ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే, ఆలయం ముందు ఇలా చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ దర్శకుడిపై భక్తుల మండిపాటు
ఆదిపురుష్ దర్శకుడిపై భక్తుల మండిపాటు
author img

By

Published : Jun 7, 2023, 12:12 PM IST

Updated : Jun 7, 2023, 1:50 PM IST

ఆదిపురుష్ దర్శకుడిపై భక్తుల మండిపాటు

Devotees' anger against Om Raut : ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన వ్యవహరించడమే అందుకు కారణం. ఆదిపురుష్ ఘన విజయం సాధించాలని కోరుతూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంగళవారం సాయంత్రం స్వామివారి పాదాల చెంత నిర్వహించగా.. చిత్ర బృందం ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు. కాగా, దర్శనానంతరం ఆలయం వెలుపల ఓం రౌత్ ప్రవర్తించిన తీరు భక్తులకు విసుగు పుట్టించింది. తిరిగి వెళ్తున్న సమయాన ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొంటూ కృతి సనన్ దగ్గరకు వచ్చిన ఓం రౌత్.. ఆమెను హగ్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె చెంపపై ముద్దు పెట్టుకుని ఫ్లయింగ్ కిస్ కూడా ఇవ్వడం భక్తుల్లో కోపానికి కారణమైంది.

సినీ ఇండస్ట్రీలో ముద్దులు పెట్టుకోవడం(పెక్), ఫ్లయింగ్ కిస్ సహజమే అయినా.. పవిత్ర తిరుమల క్షేత్రంలో ఇలా చేయడం సరికాదు అని భక్తులు పేర్కొంటున్నారు. పాశ్చాత్య సంస్కృతి పేరిట హిందూ సంస్కృతిని హేళన చేసేలా ఆలయ పరిసరాల్లో ముద్దులు పెట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓం రౌత్ అనాలోచితంగా చేసిన ఈ పనిపై నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మీ చేష్టలను పవిత్రమైన ప్రదేశానికి తీసుకురావడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో ఆలయ ఆవరణలో ముద్దులు, కౌగిలించుకోవడం అగౌరవం, ఆమోదయోగ్యం కాదని రమేశ్ నాయుడు అనే బీజేపీ నేత ట్విటర్​లో పోస్టు చేశారు.

స్వామి వారి సేవలో.. తిరుమల శ్రీవారిని ఆది పురుష్ చిత్ర నటి కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అర్చన సేవ, స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొన్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇక్కడే పెళ్లి చేసుకుంటా.. టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అంటే... ముందుగా పాన్ ఇండియా స్టార్​ ప్ర‌భాస్‌ పేరు గుర్తొస్తుంది. తన పెళ్లి గురించి వార్త‌లు, పుకార్లు అనేకం వస్తున్నా.. పలు సందర్భాల్లో వాటిపై ఆయన స్పందించారు కూడా. ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతిసనన్​తో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగినా.. అది అవాస్తమని ఆ తర్వాత తెలిసింది. అయితే, ఎట్టకేలకు తన పెళ్లి గురించి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్​ వేదికపై ప్రభాస్ మాట్లాడారు. తిరుప‌తిలోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి.. అభిమానుల్లో సవాలక్ష సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇకపై ఎక్కువ సినిమాలు చేస్తానని, ఏడాదిలో రెండు మూడు సినిమాలు కూడా రావొచ్చని అన్నారు. తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తానని చెప్పారు.

ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఏడు నెలల క్రితం తన అభిమానులకు త్రీడీలో టీజర్‌ను చూపించాలని దర్శకుడిని అడిగానని.. ట్రైలర్‌ కూడా ఫ్యాన్స్​కు చూపించాలని కోరానని ప్రభాస్ తెలిపారు. అభిమానులే తన బలమన్న ప్రభాస్.. ఈ మూవీ కోసం డైరెక్టర్​, ప్రొడ్యూసర్స్​, టెక్నికల్​ టీమ్​ ఎనిమిది నెలల పాటు యుద్ధమే చేసిందని చెప్పారు. ఒక్కొక్కరూ రోజుకి 20 గంటల పాటు శ్రమించారని తెలిపారు. ఇది సినిమా కాదు.. మా అదృష్టం అని చెప్పుకొచ్చారు. మెగాస్టార్​ చిరంజీవి సర్‌ను కలిసినప్పుడు 'రామాయణం చేస్తున్నావా?' అని అడిగారని... అవుననగానే 'అది అందరికీ దొరికే అవకాశం కాదు, నీకు దొరికింది... నిజంగా అదృష్టం' అన్నారని గుర్తు చేసుకున్నారు.

Last Updated : Jun 7, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.