ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ సీఎంగా తీరథ్​ సింగ్​​ ప్రమాణం - ఉత్తరాఖండ్​ కొత్త ప్రభుత్వం

ఉత్తరాఖండ్​ సీఎంగా భాజపా సీనియర్​ నేత, గడ్వాల్​ ఎంపీ తీరథ్​ సింగ్​ రావత్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tirath Singh Rawat
ఉత్తరాఖండ్​ సీఎంగా తీరథ్​ సింగ్​​ ప్రమాణం
author img

By

Published : Mar 10, 2021, 4:04 PM IST

Updated : Mar 10, 2021, 6:30 PM IST

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రిగా తీరథ్​ సింగ్​ రావత్​ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్​భవన్​లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రమాణం చేయించారు గవర్నర్​ బేబి రాణి మౌర్య.

Tirath Singh Rawat
ప్రమాణ స్వీకారంలో తీరథ్​ సింగ్​ రావత్​
Tirath Singh Rawat
ముఖ్యమంత్రిగా తీరథ్​ ప్రమాణం
Tirath Singh Rawat
గవర్నర్​తో తీరథ్​ సింగ్​ రావత్​

ఉత్తరాఖండ్​లో అసమ్మతి నేపథ్యంలో సీఎం పీఠాన్ని త్రివేంద్ర సింగ్​ రావత్​ వీడారు. ఆయన స్థానంలో తీరథ్​ సింగ్​ను ఎంపిక చేసింది భాజపా అధిష్ఠానం. దేహ్రాదూన్​లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమై భాజపా శాసనసభాపక్ష నేతగా తీరథ్​ను ఎన్నుకున్నారు.

తీరథ్​ సింగ్​ రావత్​ ప్రస్తుతం గడ్వాల్​ ఎంపీగా ఉన్నారు. 2013-15 వరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. 2012-17 వరకు చౌబట్టఖల్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు.

మోదీ శుభాకాంక్షలు..

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తీరథ్​ సింగ్​ రావత్​కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అపారమైన పరిపాలన, సంస్థాగత అనుభవాన్ని ఆయనతో పాటు తీసుకొచ్చారని కొనియాడారు. రావత్​ నాయకత్వంలో రాష్ట్ర పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుతుందని తెలిపారు.

భాజపా నేతలు..

తీరథ్​ సింగ్​ రావత్​కు పలువురు భాజపా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సూచనలతో అభివృద్ధికి సరికొత్త దిశలను చూపుతారనే నమ్మకం ఉందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కేంద్ర పథకాలను ప్రతి ఒక్కరికీ చేరేలా చూస్తారని తెలిపారు. తీరథ్​ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ప్రయత్నాలు కొత్త శక్తితో దూసుకెళ్తాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రజా జీవితంపై రావత్​కు అపారమైన అనుభవం ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​. రాష్ట్రంలో అభివృద్ధి, సుపరిపాలనలో ముందుకు సాగుతుందన్నారు.

ఇదీ చూడండి: రాజకీయ అస్థిత్వానికి చిరునామాగా ఉత్తరాఖండ్​!

Last Updated : Mar 10, 2021, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.