కాంగ్రెస్తో రాజీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని వస్తున్న వార్తలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(Amarinder Singh News) శుక్రవారం ఖండించారు. ఆ పార్టీతో సయోధ్యకు సమయం ముగిసిపోయిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ను వీడాలని తాను తీసుకున్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. త్వరలోనే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని పునరుద్ఘాటించారు.
"కాంగ్రెస్తో తెరవెనుక చర్చలు జరుపుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. ఆ పార్టీతో సయోధ్యకు సమయం ముగిసిపోయింది. చాలా ఆలోచించిన తర్వాతే కాంగ్రెస్ను వీడాలని నిశ్చయించుకున్నాను. అదే ఇక చివరిది. నాకు మద్దతు అందించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ, ఇప్పుడు కాంగ్రెస్లో మాత్రం ఉండను."
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
తనను పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు... చర్చల జరుపుతున్నారని కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలపై అమరీందర్(Amarinder Singh News) ఈ మేరకు స్పందించారు.
"నేను త్వరలోనే నా సొంత పార్టీని ఏర్పాటు చేస్తాను. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై భాజపా, అకాలీ చీలిక వర్గాలు సహా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతాను. పంజాబ్ ప్రజలు, రైతుల కోసం ఓ బలమైన సామూహిక శక్తిని నిర్మించాలనుకుంటున్నాను."
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
కాంగ్రెస్ నేతలు చాలా మంది తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఎన్నికల సంఘం(ఈసీ) ఆమోదం తెలపాకే కొత్త పార్టీ పేరు(Amarinder Singh New Party Name), గుర్తు ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ బుధవారం తెలిపారు. పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నా: అమరీందర్ సింగ్
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ హామీలన్నీ నా హయాంలోనే పూర్తి చేశాం'